ఎమ్మెల్యే కి ఘనంగా స్వాగతం
1 min readమండల మరియు పట్టణ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు
రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సెంటున్నర స్థలం ఇచ్చిన ఘనత మనదే… శిల్పా
ప్రతిపక్ష నాయకుల అసత్య ప్రచారాలను నమ్మొద్దు… శిల్పా
పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సెంటున్నర స్థలం ఇచ్చిన ఘనత మనదే అని తెలియజేశారు, అదేవిధంగా ఈరోజు వెలుగోడు మండల, పట్టణవా సులందరికి ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా వారికి మన ప్రభుత్వం ద్వారా పూర్తిస్థాయి హక్కు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నామంటే అదికేవలం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యమైందని తెలియజేశారు. అంతేకాకుండా ఈరోజు 1 1/2 స్థలంలో చాలా చూడ చక్కని ఇల్లు నిర్మించుకున్నారని కొనియాడారు, అదే విధంగా ఇళ్ల స్థలాల విషయంలో ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని ప్రతిపక్ష నాయకుల కల్లబొల్లి మాటలు ఎవరు నమ్మొద్దని లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించారు అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల బూటకం పథకాల గురించి ఎవరు నమ్మొద్దని, మన వైఎస్ఆర్ ప్రభుత్వం మేనిఫెస్టోను 99% అమలు చేసిన ఘనత కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వం చెబుతుందని తెలియజేశారు.అనంతరం ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి గారు మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం పేదల ప్రభుత్వమని తెలియజేశారు అదేవిధంగా శ్రీశైలం నియోజకవర్గం లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో నేను పాల్గొన్నానని, నియోజవర్గంలో చాలా అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు ,రాబోయే 2024 ఎన్నికల్లో మనము మరోసారి సీఎం గా జగన్మోహన్ రెడ్డికి, మరియు శిల్పా చక్రపాణి రెడ్డి కి గెలిపించుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా శ్రీశైలం నియోజవర్గ నాయకులు శిల్ప భువనేశ్వర్ రెడ్డిప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి కొనియాడారు.అదేవిధంగా వెలుగోడు మండల మరియు పట్టణ లబ్ధిదారులకు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి ల చేతుల మీదుగా ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం నాయకులు శిల్పా భువనేశ్వర్ రెడ్డి , వెలుగోడు మండల మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు, వెలుగోడు మండలం మరియు పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అధికారులు మండల మరియు పట్టణ లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.