నారా లోకేష్‌కు..ఘనస్వాగతం…
1 min read
పల్లెవెలుగు: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు కర్నూలు నగరంలో ఘనస్వాగతం లభించింది. నగరంలోని బళ్లారి చౌరస్తా సమీపంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీజీ భరత్ నారాలోకేష్‌కు పూలబొకే అందజేసి స్వాగతం పలికారు. నిరుద్యోగ యువత.. రైతులు, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు టీజీ భరత్. నారా లోకేష్‌కు సమస్యలు చెప్పుకునేందుకు కర్నూలు ప్రజలు, యువత ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా టీజీ భరత్ పేర్కొన్నారు.