PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర ముఖ్యమంత్రి కి  అపూర్వ స్వాగతం…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు :  కోడుమూరు రోడ్డు మార్గంలో ఉన్న కింగ్ ప్యాలస్ గ్రాండ్ కన్వెన్షన్  ఫంక్షన్ హాల్ లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కె.చెన్నకేశవ రెడ్డి మనవడు పవన్ కళ్యాణ్ రెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు  ఉదయం 11.26  గంటలకు ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్న హెలిప్యాడ్ కు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ..రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం,ఎమ్మెల్సీలు రామ సుబ్బారెడ్డి, మధుసూధన్, జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ మేయర్ బి.వై.రామయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి,కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ భార్గవ్ తేజ, ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ,  కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విజయ మనోహరి, కర్నూలు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర్ రెడ్డి, నంద్యాల జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి,  మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్, డిసిఎమ్ఎస్ చైర్మన్ శిరోమణి మద్దయ్య, డెప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక,  కార్పొరేటర్ శ్వేత రెడ్డి,  మాజీ పార్లమెంట్ సభ్యులు బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు .అనంతరం 11.38 గంటలకు హెలిప్యాడ్ నుండి రోడ్డు మార్గాన  వివాహ వేదిక వద్దకు బయలుదేరారు.

About Author