PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

న్యాయ రాజధాని స్వాగతిస్తున్నాం

1 min read

– తక్షణమే న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలి
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని, తక్షణమే న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని రాయలసీమ విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు డిమాండ్ చేశారు. స్థానిక కర్నూలు నగరంలోని బిఎయస్ ఫంక్షన్ హాల్ నందు రాయలసీమ జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యా వేత్తలు పి. లింగేశ్వర్ రెడ్డి, సురేంద్ర బాపూజీ, డాక్టర్ కెవి సుబ్బా రెడ్డి, టి చంద్ర శేఖర్, బండికే వాసుదేవయ్య, యుగెంధర్, రసూల్, రాయలసీమ ఉద్యమ నాయకులు యస్ ఖాజా మొహిద్దిన్, కటారుకొండ సాయి కుమార్, ఓంకార్, కృష్ణ మూర్తి, రోషన్ అలీ, సునీల్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, కొత్తకోట మోహన్, చంద్రప్ప, శ్రీరాములు, రఘు రామ్ యాదవ్, ఎం గిరీష్, అజయ్ కుమార్, అయ్యన్న యాదవ్, కృష్ణోజి రావు, కేసి రాముడు, ఎం ఆర్ కృష్ణ, జయ రాజు, కంది వరుణ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని రాయలసీమ జెఎసి కోరుకుంటుందని, ఇందులో భాగంగానే న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటును స్వాగతిస్తున్నామని తెలిపారు. పరిపాలన – అభివృద్ధి వికేంద్రీకరణతోనే ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి చెందుతుందని వక్తలి అభిప్రాయపడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై తమ వైఖరిని ప్రకటించాలని ఈ సందర్భంగా రాయలసీమ జెఎసి డిమాండ్ చేసింది. రాయలసీమకు న్యాయ రాజధానితో పాటు సంవత్సరానికి ఒకసారి అసెంబ్లీ సమావేశాలు, మిని సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని, నీళ్లు నిధులు నియామకంలో రాయలసీమ వాటా ప్రకటించాలని, కృష్ణా నది జలాలలో రాయలసీమకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, కృష్ణ నది జలాల పంపిణి యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలని, రాయలసీమను పారిశ్రామిక అభివృద్ధి చేయడం కోసం పన్ను రాయితీ కల్పించి పారిశ్రామికంగా ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. కర్నూలు నుండి 1956లో రాజధాని తరలించిన నవంబర్ 1ని రాయలసీమ విద్రోహ దినంగా పాటిస్తామని, న్యాయ రాజధాని సాధన కోసం నవంబర్ 7 నుంచి పోస్టు కార్డు ఉద్యమం, నవంబర్ 28 నుంచి దీక్షలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ఉద్యమకారులు ఉమ్మడి అనంతపురం జిల్లా నుండి రాజ రాయలసీమ, చంద్రశేఖర్ యాదవ్, పీక్కిలి మహేష్, శ్రీనివాసులు, కడప జిల్లా నుండి ఓబుల్ రెడ్డి, ఇంజా సోమశేఖర్ రెడ్డి, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, వినోద్ కుమార్, ధనుంజయ ఆచారి, లక్ష్మి కాంతయ్య, పిసి బల రాముడు, భరత్ కుమార్, సూర్య, వెంకట రాముడు, మహేంద్ర, శివ, రవికుమార్, సీమ కృష్ణ, లాజరస్, నగేష్, ధన విజయుడు, సువర్ణ రెడ్డి, జయ రామి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజు తదితరులు పాల్గోన్నారు.

About Author