వాట్సాప్ యూనివర్శిటీకి స్వాగతం !
1 min readపల్లెవెలుగువెబ్ : మంత్రి కేటీఆర్ బీజేపీపై వరుసబెట్టి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా బీజేపీ సమావేశాలను ఎద్దేవా చేస్తూ తాజాగా ఓ ట్వీట్ చేశారు. ‘‘అందమైన హైదరాబాద్ నగరంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశానికి వాట్సాప్ యూనివర్సిటీకి(బీజేపీని పరోక్షంగా ఉద్దేశిస్తూ..) స్వాగతం. అబద్దాల హామీకోరులందరూ.. మా దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్‌ని ఆస్వాదించడం మర్చిపోవద్దు. అలాగే తెలంగాణలో ఉన్న ప్రాంతాలను సందర్శించి.. మీ మీ రాష్ట్రాల్లో వీటిని అమలు చేసేందుకు కనీసం ప్రయత్నించండి“ అంటూ ఇక్కడి సందర్శన ప్రాంతాల ఫొటోలను ట్వీట్ చేశారు కేటీఆర్.