PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంక్షేమ, అభివృద్ధి ప్రదాతకు అండగా నిలుద్దాం

1 min read

– ఎమ్మెల్యే రవి రెడ్డిని ఆదరించండి

– సీకే దిన్నే జడ్పిటిసి నరేన్ రామాంజనేయులు రెడ్డి

– చెన్నూరు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నవైస్సార్సీపీ నాయకులు

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : నవరత్నాల రూపకర్త, సంక్షేమ , అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని, ఆయనను ఆదరించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిందని,ప్రతి కుటుంభం లో మేలు జరిగివుంటేనే మళ్ళీ వైస్సార్సీపీ కి పట్టం కట్టాలని, కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తనయులు చింతకొమ్మదిన్నె జెడ్పిటిసి పోచం రెడ్డి నరేన్ రామాంజనేయులు రెడ్డి అన్నారు, శుక్రవారం మండల వ్యాప్తంగా వైస్సార్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు,ఈసందర్భంగా చెన్నూరు టౌన్ లోని రెడ్డి వారి వీధి, మట్ట వారి వీధి , చౌడమ్మ వీధి, పాత గాంధీ నగర్ లలో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తో కలసి ఆయన ఇంటింటికి వెళ్లి ఆఇంటికి జరిగిన మేలును వచ్చిన సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని వైస్సార్సీపీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు, ఈసారి మీరు ఆశీర్వదించి గెలిపిస్తే వైయస్ జగన్మోహన్ రెడ్డి40ఏండ్లు ముఖ్యమంత్రిగాఉంటారనితెలిపారు,అలాగే ఎంఎల్ఏ రవీంద్ర నాద రెడ్డి కమలాపురం నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి పధంలో నడిపి అందరికి అందుబాటులో ఉంటు ఏసమస్య ఉన్న ఆయన దృష్టికి తీసుకెళితే ఆయన వెంటనే స్పందించి ఆయా పనులను త్వరగతిన పరిష్కరించడం జరుగుతుందన్నారు, ఆయనను మండల ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో మూడవసారి గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు,ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, ముదిరెడ్డి సుబ్బారెడ్డి, ముదిరెడ్డి రవి రెడ్డి, గుమ్మల్ల మధుసూదన్ రెడ్డి, ద్వారక నాథరెడ్డి, జె సి ఎస్ టౌన్ కన్వీనర్ శ్రీనివాసరాజు, ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, సర్పంచ్ కళ్యాణ్, సొసైటీ అధ్యక్షులు అల్లి శ్రీరామమూర్తి, వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి గుమ్మల్ల సాయికుమార్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు సత్య రాజు, ప్రదీప్ కుమార్ రెడ్డి, నిత్య పూజయ్య, అన్వర్ భాష, అబ్దుల్ రబ్, మునీర్ అహ్మద్, వారిస్, హస్రత్, సాదక్ అలీ, జుమన్, వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author