NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంక్షేమం..అభివృద్ధి… బీజేపీ లక్ష్యం

1 min read

ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి

పల్లెవెలుగు వెబ్​:  దేశ ప్రజల సంక్షేమం.. అభివృద్ధే  బీజేపీ లక్ష్యమన్నారు  ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 6 నుంచి 14వ తేదీ వరకు దేశ ప్రధాని 9 ఏళ్లలో చేసిన అభివృద్ధి… చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించే కార్యక్రమం చేస్తున్నామన్నారు.  ఇప్పటికే ప్రతి పల్లెలో ఇంటింటికి వెళ్లి కేంద్ర పథకాల గురించి వెల్లడిస్తున్నామన్నారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డా. పార్థసారధి మాట్లాడారు. దేశ జనాభాలో 60శాతం బీసీలు ఉన్నారని, వారందరినీ దరిచేర్చేందుకు బీసీలకు ప్రత్యేక సబ్​ ప్లాన్​ నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తోందన్నారు.  రాష్ట్రంలో కులానికో కార్పొరేషన్​ పెట్టిన సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి కులరాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్​మోహన్​ రెడ్డి చెబుతున్న నవరత్నాలకు 50 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, కానీ ఎక్కడా ప్రధాని నరేంద్రమోదీ పేరు చెప్పడం లేదని గుర్తు చేశారు.  రాష్ర్టంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయని వైసీపీ ప్రభుత్వం…  వచ్చే ఎన్నికల్లో  ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. సమావేశంలో ఓబీసీ జోనల్​ ఇన్​చార్జ్​ మురళీ నాయుడు, నాయకులు కాళింగ శంకర్​ శర్మ తదితరులు పాల్గొన్నారు.

About Author