ప్రజలకు బాసటగా సంక్షేమ ఫలాలు…ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలోని స్థానిక 16 వ వార్డ్ బుధవార పేట పరిధిలోని 38 వ సచివాలయం పరిధి లో ఈరోజు కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గడపగడప కార్యక్రమాన్ని చేపట్టిందని కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ తెలిపారు.గడప గడప కార్యక్రమంకు ప్రజల నుంచి విశేషా స్పందన లభించింది.ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి పొందిన లబ్దినీ తెలుపుతూ సంక్షేమ పధకాలు ఎన్ని రూపాలలో ప్రభుత్వం ప్రజలకు బాసటగా నిలుస్తుందో ప్రజలకి వివరించారు. హంద్రీ ఒడ్డున ఉన్నటువంటి బోర్ను అప్పటికప్పుడే మరమ్మతు చూపించిన కర్నూలు శాసనసభ్యులు.వీధుల్లో ఉన్న సమస్యలు గత కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం కానీ సమస్యలు అలాగే ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలు కూడ తెలుసుకొని పరిష్కరం ఈ రోజే చేసిన మొట్ట మొదటి కర్నూలు ఎమ్మెల్యే మీరేనని ఇప్పుడు మళ్లీ ఎన్నికలు జరిగితే 175 స్థానాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వేనని ప్రజలు కొనియాడారు. ముఖ్యంగా డ్రైనేజీ మరియు రోడ్లు ఇబ్బంది అలాగే పలు చోట్ల ఎన్నో ఏళ్లుగా కరెంటు తీగల వల్ల ఇబ్బంది కలుగుతుంది అని ప్రజలు తెలియజేశారు. ఈ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు.అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పధకాలు సకాలంలో అందుతున్నాయి అని, మునుపటి ఏ ప్రభుత్వాలు చేయని విధంగా ఇంటి దెగ్గరికే సంక్షేమ పధకాలు వస్తున్నాయి అని ప్రజలు సంతోషం వ్యక్తపరుస్తున్నారని కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక 16 వ వార్డు పార్టీ ఇంఛార్జి పవన్ కుమార్, నాయకులు క్రాంతి కుమార్ అలియాస్ పప్పీ, అర్పత్, రాజశేఖర్, శేఖర్, రవి, బాబర్, 15 వ వార్డ్ కేదార్ నాథ్, 14వ వార్డు ఇన్చార్జ్ మంజులత, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు మరియు సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్, కర్నూలు మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అలాగే విద్యుత్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.