చరిత్రలో ఎన్నడూ చూడని సంక్షేమం..
1 min readఅర్హత ఉంటేఇళ్ల ముంగిటకే సంక్షేమ పథకాలు.
నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అర్హులందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలును అందించడమే తన లక్ష్యమని వైసిపి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు. పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ సచివాలయం 2 పరిధిలో బుధవారం వైసీపీ నాయకులు శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్థర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆర్థర్ గడప గడప తిరుగుతూ లబ్ధిదారులతో మమేకమై అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ జగనన్న ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి వారికి సంక్షేమ పథకాల కరపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి ఇంటింటా విశేష ఆదరణ లభిస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి సమాచారంతో బుక్‌లెట్స్‌తో లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో కష్టాలు తీరిన ఆనందం ప్రజలలో కనిపిస్తోందన్నారు. నియోజకవర్గంలో వైసిపి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాబోవు కాలంలో మరింత మెరుగైన పాలన అందించేందుకు పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.జగన్ పాలనలో పార్టీలు, కులాలు, మతాలకతీతంగా అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు అందుతున్నా యన్నారు. మూడేళ్ళ పాలనలో ప్రతి ఇంటికీ వేలాది, లక్షలాది రూపాయలు లబ్దిపొందడం జరిగిందన్నారు.గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థలును ఏర్పాటు చేసి పాలనను ప్రజల చెంతకు చేర్చడం జరిగిందన్నారు.అర్హత ఉండి ఇళ్ళు రానివారికి ఇళ్ళను మంజూరు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకట రమణ, తహశీల్దార్ భారతి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ గంగిరెడ్డి రమాదేవి , జిల్లా ఎస్సి విభాగం అధ్యక్షులు సగినేల వెంకటరమణ , వైసీపీ నాయకులు విజయుడు, శ్రీనివాస గౌడ్, పాలామర్రి. జీవన్ సుందర్ రాజు , బూశి గౌడ్, తిరుపతి, జయరాముడు, మహేష్, చక్రవర్తి,బాలకృష్ణ యాదవ్ ,వెలుగు ఎపియం బిడుగు శ్రీనివాసులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ చందమాల బాలస్వామి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.