మైనారిటీల సంక్షేమం… చంద్రబాబుతోనే సాధ్యం..
1 min read
ఇమామ్లకు, మౌజమ్లకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న చంద్రబాబు…
ఇమామ్లకు, మౌజన్లకు వేతనాల కోసం నిధు లను విడుదల చేసిన సిఎం చంద్రబాబు నాయుడు…..
ధన్యవాదాలు తెలిపిన మండల మైనారిటీ నాయకులు…
పల్లెవెలుగు ,హొళగుంద : ఇమామ్లకు, మౌజన్లకు వేతనాల కోసం నిధులు విడుదల చేసి మైనారిటీలకు ఇచ్చిన హామీను సిఎం చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారని, మైనారిటీల సంక్షేమంలో భాగంగా ఇమామ్లకు,మౌజన్లకు వేతనల కొరకు నిధులు విడుదల చేయటం రాష్ట్రంలోని మైనారిటీలు గర్వించదగ్గ విషయమని మండల మైనారిటీ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మండల మైనారిటీ నాయకులు అబ్దుల్ సుభాన్,వాహిద్, సిబిఎన్ ఆర్మీ యువ నాయకుడు మోయిన్,జాకీర్,ముల్లా వలి, డాక్టర్ ఖాసిం, శాలి అమాన్ మాట్లాడుతూ చంద్రబాబు మైనార్టీల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ముందుంటారని, ఇందులో భాగంగా ఇమామ్లకు, మౌజనులకు గౌరవ వేతనాల కొరకు నిధులు విడుదల చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా మైనారిటీలకు ఇచ్చిన హామీ ప్రకారం ఇమామ్లకు మౌజనులకు గౌరవ వేతనం కోసం రూ.45 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయటం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తుంది అనడానికి నిదర్శనమని అన్నారు. కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ఎన్నో వేల మసీదులలో పనిచేస్తున్న ఇమామ్లకు మౌజనులకు వేతనం అందనుందని, ఇందుకు రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలంతా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.అంతేకాకుండా రంజాన్ మాసం ప్రారంభం కానుండడంతో రాష్ట్రంలో పనిచేస్తున్న ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు ఒక గంట ముందే కార్యాలయాల నుండి వెళ్లడానికి అనుమతి ఇవ్వడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మైనారిటీ శాఖ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ కు, శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ కు, ముస్తాక్ అహ్మద్ కు, ఆలూరు ఇన్చార్జి వీరభద్ర గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా మైనారిటీ నాయకులు శాలి మహబూబ్ బాషా, ఇలియాస్, అబ్దుల్ రహిమాన్,హేసన్, అమన్, సలీం, దూదేకుల సంఘం నాయకులు హుస్సేన్ పీరా, బడే సాబ్, మౌలాలి, హసేన్ సాబ్, దాదావలి, సాయిబేష్ తదితరులు పాల్గొన్నారు.