PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజల సంక్షేమమే…మన ప్రభుత్వ ధ్యేయం

1 min read

– అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తున్న.. ఎమ్మెల్యే, పోచంరెడ్డి,రవీంద్ర నాథ్ రెడ్డి
పల్లెవెలుగు , వెబ్​ చెన్నూరు: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రజా సమస్యల పరిష్కారం కోసమే గడపగడపకు కార్యక్రమం ముండ్లపల్లె లో నిర్వహించడం జరుగుతుందని కమలాపురం శాసనసభ్యులు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధ వారం మధ్యాహ్నం నుండి మండలంలోని ముండ్లపల్లె పంచాయతీలో కొనసాగింది, కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పి రవీంద్ర నాథ్ రెడ్డి, కి, ప్రజలు, వైయస్సార్ సిపి నాయకులు బ్రహ్మరథం పట్టారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఏ కుటుంబానికి ఎంతెంత లబ్ధి చేకూరిందో వివరించడం జరిగింది, అంతేకాకుండా ఆయా కుటుంబంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుని వాటిని అక్కడే ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరిగింది, దేవుడి దయవల్ల మీ అందరికీ చల్లని దీవెనలతో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలన కొనసాగింధన్నారు, ఈ మూడేళ్లలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సుపరిపాలన అందించడం జరిగిందన్నారు, నవరత్నాల పేరుతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది అన్నారు, అవ్వాతాతలకు, నెల నెల పింఛన్ అందించడం జరుగుతుందన్నారు, అంతేకాకుండా పింఛన్ మళ్లీ పెంచి ఇవ్వడం జరుగుతుందన్నారు, కొంతమంది ప్రజలు, పక్కా గృహాల సమస్య, అదేవిధంగా కట్టుకున్న ఇళ్లకు బిల్లులు ఇవ్వాలని గృహ నిర్మాణ లబ్ధిదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది, అలాగే డ్రైనేజీ కాలువలు కూడా మంజూరు చేయాలని వారు ఎమ్మెల్యే కి తెలియజేశారు, స్పందించిన ఎమ్మెల్యే హౌసింగ్ అధికారులకు హౌసింగ్ బిల్లులు సకాలంలో అదేవిధంగా చర్యలు చేపట్టాలని వారికి సూచించారు, ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అక్కడి ప్రజలను ఆయన కోరారు, మేము అధికారులు అంతా కలిసి మీ ఇంటి వద్దకే వచ్చాం, మీ సమస్యలు మాకు చెప్పండి మేము పరిష్కారం చేస్తామని ఆయన ప్రజలను అదే పదే అడగడం జరిగింది, ఇక్కడ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలని, ఒకవేళ ఏదైనా సమస్య వల్ల ఆ పథకం అందకపోతే తమ దృష్టికి తీసుకురావాలని ఇక్కడ కులాలు కానీ, మతాలు కానీ, పార్టీలు అసలే చూడరని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలియజేశారు, అనంతరం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రవేశపెడుతున్న పథకాలు ప్రతి ఒక్కరికి అందజేయడమే గడప గడప యొక్క ముఖ్య ఉద్దేశమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు, అంతేకాకుండా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలియజేశారు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని, ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని ఆయన ఈ సందర్భంగ తెలియజేశారు, , మీ అందరి చల్లని దీవెన జగనన్నకు ఉంటుందని, ఇంకా మంచి పరిపాలన అందిస్తాడని ఆయన అన్నారు,గడపగడపకు వెళుతూ ప్రజలతో మమేకమై వారిని అక్క బాగున్నావా.. అన్న బాగున్నావా.. అవ్వ తాత… మీకు పెన్షన్ అందుతుందా. .. అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, ఆ సమస్యలను అక్కడికక్కడే ప్రతినిధుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేయడంతో.. ప్రజల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి, కొంతమంది అవ్వా తాతలు జగన్ ప్రభుత్వం పై దీవెనలు కురిపిస్తూ చల్లగా ఉండాలని ఆశీర్వదించారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ అల్లాడు అమరావతి, అల్లాడు పాండురంగారెడ్డి, మాజీ సర్పంచ్ ముండ్ల లావణ్య , మల్లికార్జున రెడ్డి, కృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ఎంపీపీ చిర్ల సురేష్ యాదవ్, , వైయస్సార్సీపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మా సీమ బాబు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జి ఎన్, భాస్కర్ రెడ్డి ,సొసైటీ అధ్యక్షులు ముది రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ,వై ఎస్ ఆర్ సి పి కమలాపురం మైనార్టీ కన్వీనర్ అన్వర్ భాష, ,ఎంపీటీసీ లు ముది రెడ్డి సుబ్బారెడ్డి, ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, రఘురాం రెడ్డి, సాధిక్ అలీ, మండల కో ఆప్షన్ నెంబర్ వారిస్, పెడ బల్లె ప్రదీప్ రెడ్డి,మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గ

About Author