PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు..

1 min read

– ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే
పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: జగనన్న పాలనలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ పేర్కొన్నారు.సోమవారం మండలం లోని కొణిదేల గ్రామ పంచాయతీ లో 1 వ 2 వసచివాలయ పరిధిలోని గడప గడప కు ప్రభుత్వం కార్యక్రమాన్ని సర్పంచి కొంగర నవీన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులుతో కలసి ఎమ్మెల్యే ఆర్థర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటా పర్యటించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అన్న విషయాలను ప్రజలతో నేరుగా చర్చించారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రధానమైన అంశాలలో వైయస్సార్ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి ,వైయస్సార్ చేయూత, పెన్షన్ పెంపు ,ఫీజు రియంబర్స్మెంట్ , యువతకు ఉపాధి, వైయస్సార్ ఆసరా, మైనారిటీ, బీసీ సంక్షేమం నాయి బ్రాహ్మణులు, టైలర్లు రజకులకు ఆర్థిక సహాయం, చేయూత, చేనేత కార్మికులకు సంక్షేమం వంటి కార్యక్రమాలు ఆయా లబ్ధిదారులకు చెందుతూ అంశాలను ఇంటింటా లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు చేరలేదని తమ దృష్టికి వస్తే వెంటనే స్థానిక అధికారులతో చర్చించి వెంటనే వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ పథకాలు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టాడని వివరించారు. అభివృద్ధిలో చాలా ముందు ఉన్నామన్నారు. జగనన్న పాలనలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పాలన సాగిస్తున్నారని చెప్పారు.ఎన్నికలలో ఇచ్చిన హామీలను తొంభై ఎనిమిది శాతానికిపైగా హామీలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని స్పష్టం చేశారు.
అక్కచెల్లెమ్మల నోట జగనన్న మాట…
ప్రతి ఇంటా ఎమ్మెల్యే ఆర్థర్ కు ఆత్మీయ స్వాగతాలు పలుకుతున్న మహిళలు..
గడప గడప కు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి ఇంటా మహిళల నుంచి ఆత్మీయ స్వాగతాలు లభిస్తున్నాయి.జగన్ ప్రభుత్వం అందచేస్తున్న పథకాలును వారే ఎంఎల్ఏ కు తెలుపుతూ , ఈ పథకాలుతో తాము ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. మహిళలకు ప్రతిఅంశంలోనూ పెద్దపీట వేస్తున్నారని, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని, కల్పించడం,పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలుకు బాసటగా నిలిచేందుకు వైఎస్ఆర్ ఆసరా, చేయూత, సున్నావడ్డీ, బ్యాంకు లింకేజీ తదితరపథకాలు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయంటూ మహిళలు శ్రీకాంత్ కి వివరించారు. మహిళల సంక్షేమానికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ బీమా, చేదోడు, ఆమ్మఒడి ప్రతి పథకం ఎవ్వరి సిపారసు లేకుండానే నేరుగా తమ బ్యాంకు ఖాతాలలోకి నగదును జమ అవుచుండం గొప్పవిషయమని అక్కచెల్లెమ్మలు తెలిపారు.మహిళలకు రక్షణ కవచంగా దిశ చట్టాన్ని చేశారని, మహిళల భద్రత, సంక్షేమం కోసం సీఎం జగన్ కృషిచేయడం అభినంద నీయమని జగనన్న మేలు మరువలేమంటూ , సీఎం జగన్ చాలా మంచి వారంటూ ఎమ్మెల్యే ఎదుట మహిళలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ రాష్ట్ర డైరెక్టర్ అబ్దుల్ షూకురు.రాష్ట్ర హౌసింగ్ డైరెక్టర్ గంగిరెడ్డి రమాదేవి,డిప్యూటీ తహశీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ శోభా రాణి, విద్యుత్ శాఖ ఏఈ రాము నాయక్, మండల వ్యవసాయ అధికారి శ్రావణి, పశు వైద్యాధికారి నవీన్ కుమార్ రెడ్డి,మత్య్స శాఖ అధికారి భరత్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈ మాధురి, పంచాయతీ రాజ్ ఏఈ ప్రతాప్ రెడ్డి , హౌసింగ్ ఏఈ అరుణ్, ఇఓఆర్ పిడి సుబ్రహ్మణ్యం శర్మ,కేసి కాలువ ఏఈ నరేష్ ,ఐసీడీఎస్ సూపర్ వైజర్ నజ్మా,సింగిల్ విండో చైర్మన్ సగినేల ఉసేనయ్య,మాజీ సింగిల్ విండో చైర్మన్ బాలస్వామి,పంచాయతీ కార్యదర్శి గోపాల్, వీఆర్వో లు సుజిత, సురేష్, మల్లికార్జున స్వామి దేవాలయం చైర్మన్ కిరణ్ కుమార్ ,ఉప సర్పంచి భాస్కర్ రెడ్డి ,ఏపీఓ ఖాసీం, వైవైసీపీ నాయకులు ఉదయ్ కిరణ్ రెడ్డి, శంకరయ్య, మధు,వివిధ శాఖల అధికారులు, సచివాలయం సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.

About Author