NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

1 min read

పల్లెవెలుగు, వెబ్ మహానంది : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు .మండలంలోని అల్లినగరం మరియు శ్రీ నగరం గ్రామాల్లో గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయ సహకారాలు వైయస్సార్ ప్రభుత్వం అందజేసింది అన్నారు .రైతులకు పంట నష్టం జరిగినప్పుడు సబ్సిడీతోపాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పించారు అన్నారు .ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరికి నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమేనన్నారు ..ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టలేని ఎన్నో సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మరల జగనన్న ప్రభుత్వం రావాలంటే తిరిగి వైసిపికి ఓటు వేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో ఆయన వెంట మహానంది దేవస్థానం చైర్మన్ మహేశ్వర్ రెడ్డి జెడ్పిటిసి కొమ్మ మహేశ్వర్ రెడ్డి బుక్కాపురం రఘు ఇన్చార్జి ఎంపీడీవో తో పాటు డిటి నారాయణరెడ్డి మహానంది ఎస్ఐ నాగార్జున రెడ్డి ఇతర వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author