అర్హులందరికీ సంక్షేమ పథకాలు
1 min read– ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: 43వ వార్డులో ఉన్న లబ్ధిదారులకు నూతన పెన్షన్లను మరియు వై.యస్.ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ను సచివాలయం సిబ్బందితో మరియు వార్డ్ నాయకులతో కలిసి అందజేస్తున్న కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారునాడు పెన్షన్ వేయి అయితే నేడు మన జగన్ అన్న ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు 2750/-₹ వికలాంగులకు 3000/-₹ వచ్చే జనవరి నాటికీ పెన్షన్ 3000/-43వ వార్డ్ 112వ సచివాలయం పరిధిలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించిన ఘనత సీఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. ఈరోజు ఉదయం ఇందిరా గాంధీ నగర్ 43వ వార్డు 112 సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.ఇంటింటికీ తిరిగి జగనన్న అందిస్తున్న సేవల గురించి సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరిని వివరించారు.వారి సమస్యలు అడిగి తెలుసుకొని వెంటనే సంబంధిత అధికారులకు సమస్య పరిష్కరించాలని అన్నారు.పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డ్ వైస్సార్సీపీ నాయకులు రైల్వే ప్రసాద్ ,అడ్వకేట్ రాజేష్ , వాహేదా ,నాగేశ్వరావు , రంగన్న , ప్రసాద్ ,షాఫీ ,రేణుక,క్షమిమా , సుశీల ,సంజమ్మ సచివాలయం సిబ్బంది మరియు మున్సిపాలిటీ సిబ్బంది స్థానిక వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.