అర్హులైన ప్రతి కుటుంబానికి- సంక్షేమ పథకాలు
1 min read– గడప గడప కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం
పల్లెవెలుగు , వెబ్ చెన్నూరు : అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, శనివారం మండలంలోని 50 వ, డివిజన్ చిన్నమాచుపల్లి లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగింది, కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పి రవీంద్ర నాథ్ రెడ్డి, కి ప్రజలు, వైయస్సార్ సిపి నాయకులు బ్రహ్మరథం పట్టారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఏ కుటుంబానికి ఎంతెంత లబ్ధి చేకూరిందో వివరించడం జరిగింది, అంతేకాకుండా ఆయా కుటుంబంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుని వాటిని అక్కడే ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరిగింది, దేవుడి దయవల్ల మీ అందరికీ చల్లని దీవెనలతో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలన కొనసాగింధన్నారు, ఈ మూడేళ్లలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సుపరిపాలన అందించడం జరిగిందన్నారు, నవరత్నాల పేరుతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది అన్నారు, అవ్వాతాతలకు, నెల నెల పింఛన్ అందించడం జరుగుతుందన్నారు, అంతేకాకుండా పింఛన్ మళ్లీ పెంచి ఇవ్వడం జరుగుతుందన్నారు, మీ అందరి చల్లని దీవెనలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆదరించి- ఆశీర్వదించాలని ఆయన కోరారు, అనంతరం కొంతమంది ప్రజలు, తమకు పెన్షన్ అందడం లేదని, అలాగే వికలాంగ పెన్షన్ కావాలని, సదరం సర్టిఫికెట్ కావాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది, అలాగే మా పిల్లల ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్ గారితో తమరు మాట్లాడాలని మరికొంతమంది అభ్యర్థించడం జరిగింది, అలాగే మాకు అమ్మ ఒడి పథకం అందడం లేదని , ప్రభుత్వ పక్క గృహాలు కావాలని ఎమ్మెల్యేకి తెలియజేశారు,స్పందించిన ఎమ్మెల్యే అధికారులకు తెలియజేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందేవిధంగా గ్రామ వాలంటీర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు, అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ పక్క గృహాలు మంజూరు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు, ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అదే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు, ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అక్కడి ప్రజలను ఆయన కోరారు, మీరు సమస్యలు నా దృష్టికి తీసుకొస్తే మేము అధికారులు అంతా కలిసి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని ఆయన తెలియజేశారు, మీ సమస్యలు తెలుసుకునేందుకే మీ ఇంటి వద్దకే రావడం జరిగిందని, మీ సమస్యలు మాకు చెప్పండి మేము పరిష్కారం చేస్తామని ఆయన ప్రజలను అదే పదే అడగడం జరిగింది, ఇక్కడ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలని, ఒకవేళ ఏదైనా సమస్య వల్ల ఆ పథకం అందకపోతే తమ దృష్టికి తీసుకురావాలని ఇక్కడ కులాలు కానీ, మతాలు కానీ, పార్టీలు అసలే చూడరని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలియజేశారు, గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వాటిని పరిష్కరించడం జరిగింది.. అనంతరం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రవేశపెడుతున్న పథకాలు ప్రతి ఒక్కరికి అందజేయడమే గడప గడప యొక్క ముఖ్య ఉద్దేశమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు, అంతేకాకుండా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలియజేశారు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని, ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని ఆయన ఈ సందర్భంగ తెలియజేశారు, , మీ అందరి చల్లని దీవెన జగనన్నకు ఉంటుందని, ఇంకా మంచి పరిపాలన అందిస్తాడని ఆయన అన్నారు,గడపగడపకు వెళుతూ ప్రజలతో మమేకమై వారిని అక్క బాగున్నావా.. అన్న బాగున్నావా.. అవ్వ తాత… మీకు పెన్షన్ అందుతుందా. .. అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, ఆ సమస్యలను అక్కడికక్కడే ప్రతినిధుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేయడంతో.. ప్రజల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి, కొంతమంది అవ్వా తాతలు జగన్ ప్రభుత్వం పై దీవెనలు కురిపిస్తూ చల్లగా ఉండాలని ఆశీర్వదించారు, ఈ కార్యక్రమంలో, స్థానికులు బుజ్జిరెడ్డి , చంటి, శ్రీనివాసులు, సుబ్బారావు, శివ తో పాటు 50 వ డివిజన్ కార్పొరేటర్ కె రాజశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాసిమ బాబు, ఎంపీపీ చిర్ల సురేష్ యాదవ్, మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్, , రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి, ,వై ఎస్ ఆర్ సి పి కమలాపురం మైనార్టీ కన్వీనర్ అన్వర్ భాష, ,ఎంపీటీసీ లు ముది రెడ్డి సుబ్బారెడ్డి, దుంప నాగిరెడ్డి ,ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, రఘురాం రెడ్డి,, సర్పంచులు సిద్ధిగారి వెంకటసుబ్బయ్య, సొంతం నారాయణరెడ్డి, తుంగ చంద్రశేఖర్ యాదవ్, మండల కో ఆప్షన్ నెంబర్ వారిస్,, వైఎస్ఆర్సిపి నాయకులు పెడబల్లె ప్రదీప్ కుమార్ రెడ్డి, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.