PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు

1 min read

– అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తున్న..
– ఎమ్మెల్యే, పోచంరెడ్డి రవీంద్ర నాథ్ రెడ్డి,
పల్లెవెలుగు, వెబ్ చెన్నూరు : అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, శనివారం మండలంలోని 49వ, డివిజన్ శేషయ్య గారి పల్లి, రుద్ర భారతి పేట, శాటిలైట్ సిటీ లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగింది, కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పి రవీంద్ర నాథ్ రెడ్డి, కి ప్రజలు, వైయస్సార్ సిపి నాయకులు బ్రహ్మరథం పట్టారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఏ కుటుంబానికి ఎంతెంత లబ్ధి చేకూరిందో వివరించడం జరిగింది, అంతేకాకుండా ఆయా కుటుంబంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుని వాటిని అక్కడే ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరిగింది, దేవుడి దయవల్ల మీ అందరికీ చల్లని దీవెనలతో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలన కొనసాగింధన్నారు, ఈ మూడేళ్లలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సుపరిపాలన అందించడం జరిగిందన్నారు, నవరత్నాల పేరుతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది అన్నారు, అవ్వాతాతలకు, నెల నెల పింఛన్ అందించడం జరుగుతుందన్నారు, అంతేకాకుండా పింఛన్ మళ్లీ పెంచి ఇవ్వడం జరుగుతుందన్నారు, మీ అందరి చల్లని దీవెనలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆదరించి- ఆశీర్వదించాలని ఆయన కోరారు, అనంతరం కొంతమంది ప్రజలు, తమకు పెన్షన్ అందడం లేదని, అలాగే వికలాంగ పెన్షన్ కావాలని, సదరం సర్టిఫికెట్ కావాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది, , ప్రభుత్వ పక్క గృహాలు మంజూరు చేయాలని డ్రైనేజీలు, రోడ్లు కావాలని, అదేవిధంగా స్మశాన వాటిక స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేకి తెలియజేశారు,స్పందించిన ఎమ్మెల్యే అధికారులకు తెలియజేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందేవిధంగా గ్రామ వాలంటీర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు, అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ పక్క గృహాలు మంజూరు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు, ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అదే విధంగా అధికారులు అనంతరం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, , ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని, ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని, , మీ అందరి చల్లని దీవెన జగనన్నకు ఉంటుందని, ఇంకా మంచి పరిపాలన అందిస్తాడని ఆయన అన్నారు,గడపగడపకు వెళుతూ ప్రజలతో మమేకమై వారిని అక్క బాగున్నావా.. అన్న బాగున్నావా.. అవ్వ తాత… మీకు పెన్షన్ అందుతుందా. .. అంటూ ఆప్యాయంగా పలకరిస్తుండడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి, కొంతమంది అవ్వా తాతలు జగన్ ప్రభుత్వం పై దీవెనలు కురిపిస్తూ చల్లగా ఉండాలని ఆశీర్వదించారు, ఈ కార్యక్రమంలో, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ కరీముల్లా, స్థానికులు బుజ్జిరెడ్డి , చంటి, శ్రీనివాసులు, సుబ్బారావు, శివ , మధ్యల కేశవ తో పాటు 50 వ డివిజన్ కార్పొరేటర్ కె రాజశేఖర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాసిమ బాబు, ఎంపీపీ చిర్ల సురేష్ యాదవ్, మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్, , రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి, , ,ఎంపీటీసీ లు,ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, ఎర్ర సాని మోహన్ రెడ్డి సర్పంచులు సిద్ధిగారి వెంకటసుబ్బయ్య, సొంతం నారాయణరెడ్డి, తుంగ చంద్రశేఖర్ యాదవ్, మండల కో ఆప్షన్ నెంబర్ వారిస్,, వైఎస్ఆర్సిపి నాయకులు పెడబల్లె ప్రదీప్ కుమార్ రెడ్డి, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

About Author