పేదల ఆర్థికాభివృద్ధి కోసమే సంక్షేమ పథకాలు అమలు ..ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: 45వ వార్డ్ 116వ సచివాలయం పరిధిలో లేబర్ కాలనీ వీధుల్లో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగింది పార్కుల అభివృద్ధి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో లో జరిగాయి అని పేర్కొన్నారు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం 45వ వార్డ్ 116వ సచివాలయం పరిధిలో ఉన్న లేబర్ కాలనీ వీధుల్లో నిర్వహించారు.పేదల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ అన్నారు. స్థానిక 45వ వార్డులో మున్సిపల్, సచివాలయ సిబ్బంది, స్థానిక వార్డ్ నాయకులతో కలిసి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. లేబర్ కాలనీ విధిలో ఉన్న ప్రతి ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధితోనే పేదల బతుకులు మారుతాయని చెప్పారు. ఈ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి మేలు చేసేలా పథకాలు తీసుకొచ్చి పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో 45వ వార్డ్ వైస్సార్సీపీ నాయకులు ప్రభుదాస్, జమ్మన్న, భాస్కర్ రెడ్డి, సితార ఇర్ఫాన్, షైక్, సాదిక్, జోషి రాజ్, చందు, ఖాదర్ బాషా, జనార్దన్ రెడ్డి రామకృష్ణ,చాంద్ బాషా,మరియు పార్టీ ముఖ్యనాయకులు, వార్డ్ కన్వీనర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.