తలుపు తట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు: యుగంధర్ రెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడంలో వైకాపా ప్రభుత్వం ముందంజలో ఉందని అంతే కాకుండా అర్హులైన సంక్షేమ పథకాలను ప్రజలకు తలుపు తట్టి అందించిన ఘనత వైకాపా కే సాధ్యం అయిందని జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి,ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని వీపనగండ్ల గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన పల్లెకు పోదాం అనే కార్యక్రమం గ్రామ సర్పంచ్ భారతి అధ్యక్షతన జరిగినది.సమావేశంలో గ్రామానికి వివిధ పథకాల ద్వారా వచ్చినటువంటి నగదు వివరాల గురించి బోర్డును టిడిపి మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర రెడ్డి మరియు నాయకులు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాలనే దృఢ సంకల్పంతో ఆయన ఉన్నారని ప్రతిపక్ష పార్టీకి కూడా తలుపు తట్టి పథకాలు అందిస్తున్నామని వారు అన్నారు.తదనంతరం గ్రామంలో పార్టీ జెండాను నాయకులు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కోటేశ్వరరావు,ఈఓఆర్డి ఫక్రుద్దీన్,సహకార సొసైటీ చైర్మన్ తులసిరెడ్డి,వైస్ ఎంపీపీ టి.నబి రసూల్,బైరాపురం సర్పంచ్ ఫనిభూషణ్ రెడ్డి,జెసిఎస్ మండల కన్వీనర్ రవికుమార్,మండల కో ఆప్షన్ సభ్యులు పెద్దమౌలా,మహబూబ్ బాష,ఎల్లారెడ్డి,గ్రామ వైసీపీ నాయకులు తిమ్మారెడ్డి,రాజేషయ్య,పంచాయితీ కార్యదర్శి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.