PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న ప్రభుత్వం హయాంలోనే అందుతున్న సంక్షేమ పథకాలు

1 min read

– అర్హుల ఇంటికి సంక్షేమ పథకాలు

– జగనన్న సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తున్న ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  సోమవారం సాయంత్రం కొనసాగిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం 5వ వార్డ్ 13వ సచివాలయం పరిధిలో ఉన్న గడ్డ ఈద్గా,చిత్తర్ వీధుల్లో నిర్వహించారు.పేదల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు అన్నారు. స్థానిక 5వ వార్డులో మున్సిపల్, సచివాలయ సిబ్బంది, స్థానిక వార్డ్ నాయకులతో కలిసి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కుమారి విధిలో ఉన్న ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధితోనే పేదల బతుకులు మారుతాయని చెప్పారు. ఈ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రతి ఇంటికి మేలు చేసేలా పథకాలు తీసుకొచ్చి పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో 5వ వార్డ్ కార్పొరేటర్ జి.యల్.వి సుజాత  పార్టీ ముఖ్యనాయకులు జి.యల్.వి శేషు యాదవ్ ,అక్బర్ అలీ , మెహబూబ్ బాషా గ, ఖాదర్ , మాక్సూద్ ,అబ్దుల్లా,మొయిద్ ,జెట్టి యాదవ్ , వెంకీ యాదవ్ ,యుగేందర్ ,  శ్రీనివాసులు ,మళ్ళీ  , ఫాతిమా , అమ్రీన్ , శ్రీదేవి ,ఆచారి ,సత్యమయ్య , రాజు , ఆరిఫ్ ,శారదా , శకుంతల ,కన్వీనర్లు,కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author