PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాల్సిందే..

1 min read

పల్లెవెలుగు, వెబ్​ మిడుతూరు: మండల పరిధిలోని కాజీపేట గ్రామంలో ఉదయం 10 గంటలకు గడప గడప కార్యక్రమం ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ ప్రారంభించారు.గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించి వారికి సరైన సమాధానం ఇస్తూ ముందుకు సాగారు.గ్రామంలో ఉన్న విద్యార్థులు చింతలపల్లి,మిడుతూరు,నందికొట్కూరుకు హైస్కూలు,కాలేజీకి వెళ్లాలంటే మాగ్రామానికి బస్సు సౌకర్యం లేనందు వల్ల విద్యార్థులు ఆటోలలో వెళ్లాల్సిన పరిస్థితి ఉందని బస్సును వచ్చే విధంగా చూడాలని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.ఓవృద్ధురాలు నాకు అన్ని అర్హతలు ఉన్నా పథకం అందలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.సచివాలయ సిబ్బందిని అడగగా తల ఊపడం,సరే అని అనడం సరిగ్గా పనిచేయకపోవడం నాకు నచ్చదు.కానీ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాల్సిదేనని ఎమ్మెల్యే సిబ్బందితో అన్నారు.గ్రామానికి చెందిన కైపా సుబ్బారెడ్డి,సుదర్శన్ రెడ్డి ఈక్రాప్ నమోదు చేయలేదని అన్నారు.ఐదు సంవత్సరాలు గల బోయ ఆది సత్యానంద్ అనే దివ్యంగా బాలుడికి పింఛన్ రావడం లేదని తల్లి ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చింది.కొత్త బిల్డింగ్ లో సిసి రోడ్డు వేయించాలని కాలనీవాసులు అన్నారు.అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేయాలని హౌసింగ్ ఏఈకి ఎమ్మెల్యే చెప్పారు.చివరగా అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు కొందరు సిబ్బంది గుర్తింపు కార్డులు,యూనిఫాం ఎందుకు ధరించలేదని తప్పనిసరిగా వాటిని ధరించాలని అప్పుడే మీకు ప్రజలలో గుర్తింపు అనేది వస్తుందని సచివాలయ సిబ్బందిపై ఆయన మండిపడ్డారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందించడమే తమ ధ్యేయమని అన్నారు.బోయ వెంకటేశ్వర్లుకు 6 ఎకరాల 50 సెంట్లు పొలం జలకనూరు గ్రామ పొలిమేరలో ఉందని ఆన్లైన్లో ఎక్కించడానికి అధికారుల దగ్గరికి ఎన్ని సార్లు తిరిగినా వారు ఎక్కించడం లేదని ఎమ్మెల్యేకు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి,రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ అబ్దుల్ షుకూర్,తలముడిపి వంగాల సిద్ధారెడ్డి,ఈఓఆర్డి ఫకృద్దీన్,ట్రాన్స్ కో ఏడి,కడుమూరు గోవర్ధన్ రెడ్డి,కాజీపేట బిజ్జం వెంకటేశ్వర రెడ్డి,రామేశ్వర రెడ్డి,డిప్యూటీ తహసిల్దార్ రవణమ్మ, మండల వ్యవసాయ అధికారి పీరు నాయక్,ఎంఈఓ మౌలాలి,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విశ్వనాథ్,ఏపీవో జయంతి, ఏపిఎం సుబ్బయ్య,ఎస్సై మారుతి శంకర్,వివిధ గ్రామాల నాయకులు షరీఫ్,ఇనాయతుల్ల,రమేష్,సీతారాముడు మరియు తదితర అధికారులు పాల్గొన్నారు.

About Author