సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి
1 min read– ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి
పల్లెవెలుగు, వెబ్ చాగలమర్రి: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటింటికి నవరత్నాలు లో భాగంగా అందుతున్నాయని, ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆళ్లగడ్డ శాసన సభ్యులు గంగుల బ్రిజేంద్ర రెడ్డి అన్నారు. సోమవారము మండలములోని తిప్పనపల్లె, చిన్నబోధనము, పెద్దబోధనము గ్రామంలో గడప గడప కార్యక్రమంలో ఇంటింటా సమస్యలను తెలుసుకున్నారు. తిప్పన పల్లెలో వంద కుటుంబాలు ఉండగా 90 రేషన్ కార్డులు ఉన్నాయి.96 మందికి సంక్షేమ పథకాలు అందాయి. చిన్నబోధం లో 359 కుటుంబాలు ఉండగా 316 రేషన్ కార్డులు ఉన్నాయి.316 మందికి సంక్షేమ పథకాలు అందాయి. పెద్దబోధనము గ్రామంలో 496 కుటుంబాలు ఉండగా 434 బియ్యం కార్డులు ఉన్నాయి.465 మందికి సంక్షేమ పథకాలు అందాయి.ఈ కార్యక్రమం లో రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్, మండలప్రజా పరిషత్ అధ్యక్షులు వీరభద్రుడు, మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, సర్పంచ్ యామా నరసమ్మ,నరేష్ సింహారెడ్డి,మాజీ సర్పంచ్ లు మస్థాన్ రెడ్డి,యామా బాలకృష్ణ రెడ్డి, రమణారెడ్డి, స్వామిరెడ్డి, లక్ష్మి రెడ్డి, రమణారెడ్డి, రామగురివి రెడ్డి, జగదీశ్వరరెడ్డి, యం. పీ. టి. సి నరసింహుడు, వివిధ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.