PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంక్షేమ పథకాలే.. విజయ సోపానాలు

1 min read
శ్రీనివాసులును గెలిపించాలని అభ్యర్థిస్తున్న మాజీ ఎంపీ బుట్టా రేణుక

శ్రీనివాసులును గెలిపించాలని అభ్యర్థిస్తున్న మాజీ ఎంపీ బుట్టా రేణుక

– మాజీ ఎంపీ బుట్టా రేణుక
పల్లెవెలుగు, కర్నూలు
సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే.. కార్పొరేట్​ అభ్యర్థుల గెలుపునకు విజయ
సోపానాలుగా నిలుస్తాయని మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ఈ నెల 10న జరగనున్న మున్సిపల్​ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నగరంలోని 46 వ వార్డు నరసింహ రెడ్డి నగర్ లో ఆమె పర్యటించారు. వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీనివాసును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించిన మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుక… దేశంలో ఏ సీఎం చేయని అభివృద్ధి, అమలు చేయని సంక్షేమపథకాలను ఏపీ సీఎం జగనన్న చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థి శ్రీనివాసులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

About Author