NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బావి భారత పౌరులు- నా భూమి నా దేశం కొరకు పాటుపడాలి

1 min read

– మండల స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ వెంకటసుబ్బయ్య

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:  భావిభారత పౌరులు మన మాతృభూమి కోసం, నా భూమి నా దేశం అంటూ పాటుపడాలని మండల స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ వెంకటసుబ్బయ్య తెలిపారు, శుక్రవారం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో నా భూమి- నా దేశం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు మనభూమి- మన దేశం కార్యక్రమంలో భాగంగా, దేశ లో స్వాతంత్రం కొరకు పాటుపడిన మహనీయులందరినీ కూడా స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు, అంతేకాకుండా వారికి వందనాలు తెలియజేస్తూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన సూచించారు, జీవితంలో ప్రతి రోజు, ప్రతిక్షణం, ప్రతి అణువు మాతృభూమి కోసం జీవించడమే ధ్యేయంగా పెట్టుకోవాలని తెలిపారు, అలాగే వీరులందరికీ వందనం, నేల తల్లికి నమస్కారం, అంటూ చేసే నినాదాలే స్వతంత్ర సమరయోధుల కోసం మనం అర్పించే నిజమైన నివాళులు అని ఆయన అన్నారు, అదేవిధంగా పర్యావరణ కొరకు పాటుపడాలని, స్వచ్ఛమైన గాలి, నీరు, సారవంతమైన నేలను భావితరాలకు అందించాలంటే, మనమందరం పుడమతల్లిని కాపాడుకోవాలని ఆయన తెలియజేశారు, అనంతరం వారు రాచినాయపల్లెలోని అమృత సరోవర్ చెరువుగట్టు పైన మొక్కలు నాటడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగనపల్లి సురేష్ బాబు, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, సర్పంచ్ సొంట్టం నారాయణరెడ్డి ఉపాధి హామీ సిబ్బంది,  ప్రజా ప్రతినిధులు , తదితరులు పాల్గొన్నారు.

About Author