NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రామ‌వాలంటీర్ల గురించి త‌ప్పుగా వెళ్లింది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శ‌్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం అర్జున‌ఫ‌ల్గుణ‌. ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమా ట్రైల‌ర్ లో గ్రామ‌వాలంటీర్ల‌ను త‌క్కువ చేస్తూ మాట్లాడిన‌ట్టు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో హీరో శ్రీవిష్ణు స్పందించారు. గ్రామ వాలంటీర్ల గురించి చెప్పిన డైలాగ్ తప్పుగా వెళ్లిందని, ట్రైలర్ అలా కట్ చేశాం కాబట్టి అలా అనిపించిందని శ్రీవిష్ణు అన్నారు. త‌న ప్రతీ సినిమాల్లో ఫీమేల్ క్యారెక్టర్‌ను స్ట్రాంగ్‌గా చూపిస్తానని, ఇందులో కూడా అలానే ఉంటుందని చెప్పారు. కానీ ఆ గ్యాంగులో ఎవరికీ ఉద్యోగం రాకుండా ఆ అమ్మాయికి మాత్రమే వస్తుందని.. కడుపు మంటతో అలా మాట్లాడతారని తెలిపారు. వివాదమనిపిస్తే, నిజంగానే ఎవరైనా హర్ట్ అవుతారని నాకు అనిపిస్తే నేనే ముందుగా సీన్లు తీసేయమని చెబుతాన‌ని తెలిపారు.

                                         

About Author