PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పశ్చిమగోదావరి జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలి.. : సీపీఐ

1 min read

పల్లెవెలుగు వెబ్​,ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాకు అల్లూరి సీతారామరాజు గా నామకరణం చేయాలని అని సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సిపిఐ జిల్లా సమితి సమావేశం స్థానిక జిల్లా కార్యాలయం స్ఫూర్తి  భవనము నందు జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఓబులేసు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరును ప్రకటించాలని గత రెండున్నర  దశాబ్దాల నుండి సిపిఐ,ఏ ఐ వై ఎఫ్ అలుపెరుగని పోరాటాలు చేసిన విషయం ప్రజలందరికీ తెలుసన్నారు.ప్రభుత్వం పాడేరును మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేయడం పట్ల సిపిఐ స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగాల ఫలితంగా ఆయన పేరును ప్రకటించినట్లు భావిస్తున్నామన్నారు. జిల్లా పరిస్థితి పరిశీలిస్తే మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు గోపాలపురం,కొవ్వూరు, నిడదవోలు రాజమండ్రి పార్లమెంట్ లో కలపటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటిని యథాతథంగా జిల్లాలోనే ఉంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కృష్ణాజిల్లా నుండి నూజివీడు, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాలను ఆ జిల్లాలో యథాస్థితిగాకొనసాగించాలన్నారు. మెట్ట ప్రాంతమైన లింగపాలెం చింతలపూడి మండలాలను నూజివీడు రెవెన్యూ డివిజన్ లో విలీనం చేయడం సరైన విధానం కాదన్నారు. ఈ రెండు మండలాల ప్రజలు రెవెన్యూ డివిజన్ కేంద్రానికి వెళ్లాలంటే దూర ప్రాంతం,రవాణా సౌకర్యాలు సరిగా లేక ప్రజలు ఎన్నో అవస్థలు పడాల్సి ఉంటుందన్నారు.చింతలపూడి, లింగపాలెం మండలం నూజివీడు రెవెన్యూ డివిజన్ లో కలపడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని సమావేశం భావించింది. ఏజెన్సీ ప్రాంతంలో విలీన మండలాలకు సంబంధించి పునరావాసం ప్యాకేజీని ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని సమావేశం తీర్మానించిందన్నారు.ఎన్నికల సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నాయకులు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం భూముల విలువ పెరిగిన కారణంగా ఎకరాకు రూ.5 లక్షలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రకారం వెంటనే చెల్లించాలని సమావేశం తీర్మానించిందన్నారు. గిరిజనులకు అటవీ హక్కుల చట్టం పటిష్టంగా అమలు చేయాలని సిపిఐ తొలగించి పోరాడుతున్న విషయాన్ని సమావేశం ప్రత్యేక ప్రస్తావించి గిరిజనుల సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తీర్మానించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమితి సభ్యులు ఎం.డి మునీర్,సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, కోనాల భీమారావు,జిల్లా సమితి సభ్యులు చెల్లుబోయిన రంగారావు,సీతారాం ప్రసాద్, కారం దారయ్య, పుప్పాల కన్నబాబు,ఉప్పులూరి హేమ శంకర్, మండల నాగేశ్వరరావు,బొద్దాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author