NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌ర్ణాట‌క‌లో క‌ల‌క‌లం.. కొత్త వేరియంట్ డెల్టా ఏవై గుర్తింపు !

1 min read

పల్లెవెలుగు వెబ్: క‌ర్ణాట‌క రాష్ట్రంలో క‌రోన కొత్త వేరింట్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. బ్రిట‌న్, ర‌ష్యా దేశాల్లో ఆందోళ‌నక‌రంగా విస్తరిస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్ కేసుల‌ను క‌ర్ణాట‌క‌లో గుర్తించారు. ప‌లువురి న‌మూనాలు ప‌రీక్షల‌కు పంప‌గా.. ఈ విష‌యం వెల్లడైంది. ఏక‌కాలంలో ఏడుగురికి వైర‌స్ సోకిన‌ట్టు ఆరోగ్య శాఖ ప్రక‌టించింది. ఈ ఏడింటిలో రెండు కేసుల‌కు డెల్టా ఏవై 4.2 ల‌క్షణాలు ఉన్నట్టు ఆరోగ్య శాఖ కమీష‌న‌ర్ డాక్టర్ ర‌ణ‌దీప్ తెలిపారు. ఏడుగురిలో ముగ్గురు బెంగ‌ళూరికి చెందిన వారు కాగా.. న‌లుగురు ఇత‌ర జిల్లాల‌కు చెందిన వారు. కొత్త వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో విదేశీ ప‌ర్యట‌న‌ల‌పై మ‌ళ్లీ ఆంక్షలు విధించాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది.

About Author