ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ పేలడానికి కారణం ఏంటంటే ?
1 min read
పల్లెవెలుగువెబ్ : పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నారు. అయితే ఇటీవల కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు సేప్టీ పై పలు అనుమానాలు రేకెత్తాయి. దీనిపై కెనడాకు చెందిన స్టార్టప్ సంస్థ మేకర్‌మ్యాక్స్ స్పందించింది. ఆ సంస్థ అధినేత అక్షయ్ మాట్లాడుతూ భారత్‌లో ద్విచక్ర వాహనాల్లో బ్యాటరీలను ఉంచే లోహపు బాక్సుల్లో తగినంత భద్రతా ఫీచర్లు ఉండటం లేదన్నారు. బ్యాటరీ నుండి వెలువడే వాయువులు తప్పించుకుపోయే మార్గం లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అక్షయ్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఒత్తిడిని విడుదల చేయగలిగే వాల్వ్‌లు గల మూడు లేదా అంతకు మించి కంపార్ట్‌మెంట్లలో బ్యాటరీలను ఉంచవచ్చని పేర్కొన్నారు. బ్యాటరీల ప్రమాదాలను.. ఫలితంగా ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించే దిశగా టెస్టింగ్ పరికరాలు, అల్గోరిథమ్‌లు రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఎం201 పరికరంతో బ్యాటరీ వాస్తవ ప్రమాణాలను .. దాని ప్రస్తుత పనితీరును విశ్లేషించి చూడవచ్చని, వ్యత్యాసాలేమైనా ఉంటే సత్వరం గుర్తించవచ్చని పేర్కొంది.