NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అగ్నిప‌థ్ పై అమిత్ షా ఏమ‌న్నారంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అగ్నిపథ్‌ ఆందోళనలపై కేంద్రం అప్రమత్తమైంది. దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లకు భద్రతను పెంచింది. రైల్వే స్టేషన్ల దగ్గర భారీగా పోలీసులను మోహరించింది. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పందించారు. ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చెందవద్దని, అగ్నిపథ్‌ వల్ల యువతకు ప్రయోజనమని తెలిపారు. మ‌రోవైపు అగ్నిపథ్‌ ఆందోళనపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పందించారు. అగ్నిపథ్‌ను యువత సరిగా అర్థం చేసుకోవాలని సూచించారు. నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం పోతుందని అనుకోవద్దన్నారు. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయన్నారు. అందులో భాగంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.

                                      

About Author