PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుప్పం పోటీ పై విశాల్ ఏమ‌న్నారంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : 2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ అభ్యర్థిగా సినీ నటుడు విశాల్‌ అంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పుకార్లపై విశాల్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను ఆ విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. రాజకీయ ప్రవేశంపై నన్ను ఇంతవరకు ఎవరూ సంప్రదించలేదు. అసలు ఈ వార్త ఎక్కడ నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాలపైనే ఉంది. ఏపీ రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశ్యం కానీ, కుప్పం నుంచి పోటీ చేసే ఆలోచన కానీ తనకు లేదని’ సినీ నటుడు విశాల్‌ తేల్చి చెప్పారు.

                                

About Author