రూపాయికి ఏమైంది ?
1 min readపల్లెవెలుగు వెబ్: రూపాయి.. రూపాయి.. నీకేమైంది. అంటే.. అవసరమైన వరకు నన్ను వాడుకుంటే నాకూ మంచిది. మీకూ మంచిది. అవసరానికి మించి నన్ను జనాల్లోకి వదిలితే.. మీ జేబులకు చిల్లు పెడతానని అందట రూపాయి. ప్రస్తుతం రూపాయి పరిస్థితి ఇలాగే ఉంది. డాలర్ విలువతో పోలిస్తే.. రూపాయి విలువ 75.05 వద్ద ఉంది. ఇది 9 నెలల కనిష్ఠ స్థాయి. గత ఏడాదితో పోలిస్తే 2 శాతం క్షీణించింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు, స్టాక్ మార్కెట్ కు ఇబ్బందికరంగా మారింది. దేశంలో డబ్బు లభ్యత పెరగడం కారణంగానే రూపాయి విలువ పడిపోతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే 7లక్షల కోట్ల నగదు మార్కెట్లో ఉంది. ప్రభుత్వం మరో లక్ష కోట్ల విలువైన బాండ్స్ ఆర్బీఐ నుంచి కొనుగోలు చేయనుంది. దీంతో రూపాయి విలువ తగ్గుతుంది. దేశీయ కరెన్సీ లభ్యత అధికంగా ఉన్నప్పుడు దాని విలువ తగ్గుతుంది. ఇటీవల ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ లో వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచాలని ఆర్బీఐ తెలిపింది. దీంతో వస్తువుల ధరలు పెరిగినా.. వడ్డీ రేట్లు పెరగకపోవడం వల్ల రూపాయి విలువ తగ్గుతుంది. వడ్డీ రేట్లు పెరగకపోతే.. విదేశీ పెట్టుబడుదారులు వేరే చోటి తమ పెట్టుబడులు తీసుకెళ్తారు. అప్పుడు కూడ రూపాయి విలువ మీద ప్రభావం చూపుతుంది.