రోజూ అన్నం తింటే ఏమవుతుంది ?
1 min readపల్లెవెలుగువెబ్ : మనిషి తన మనుగడ లో తొంబై తొమ్మిది శాతం సమయం మాంసం , దుంపలు , కాయలు పళ్ళు తిని బతికేసాడు . ఇప్పటి బాష లో చెప్పాలంటే మీట్.. సలాడ్స్ . నవీన శిలా యుగం లో అక్కడక్కడా బార్లీ లాంటి పంటలు . గోధుమ, వరి లాంటి ధాన్యాలు పండించింది కేవలం అయిదు వేల సంవత్సరాల క్రితం . దానికే మన బాడీ గా రెడీ గా లేదు . అది చాలదన్నట్టు గత నలబై యాభై సంవత్సరాల్లో కొత్త వంగడాలు.. రసాయన ఎరువులు క్రిమి సంహారక మందులు వచ్చేశాయి. మన ఆహారంలో పీచు పద్దార్థం శాతం సున్నా. పిండి పదార్థాలు తప్పించి మిగతా పోషకాలు తీసుకోవడం లేదు. ఉత్తరాది వారు మరీ దారుణం .. రసాయనాలు కలిసిన మైదా కలుపుకొని గోధుమ పిండి రొట్టెలు .. పుల్కాలు తినేస్తారు . సకల సమస్త రోగాలకు ఇవే కారణమని నిపుణులు అంటున్నారు. ఇవి చాలదన్నట్టు ఆధునిక ప్రపంచంలో ప్రొసెస్డ్ ఫుడ్స్.. ట్రాన్స్ ఫ్యాట్స్ .. జంక్ ఫుడ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.