ఎక్కువ సేపు కూర్చుంటే ఏమవుతుంది ?
1 min readపల్లెవెలుగువెబ్: రోజులో ఎక్కువ పని వేళలు పెరిగి, చాలా సమయం కూర్చుని పనిచేయడం వచ్చిన తరువాత శరీరంలో కదలికలు తగ్గి అది శరీరానికి విపరీతమైన పరిణామాలను ఇస్తుంది. సీటులో కొద్దిగా కూడా కదలికలు లేకపోవడం, నడకకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటి వాటివల్ల శరీరానికి అధికశాతం వ్యాయామం లేకుండా పోతుంది. శారీరక శ్రమ ఆరోగ్యాన్ని దీర్ఘాయువును ఇస్తుంది. అయితే రోజులో కొద్ది సేపు మాత్రమే నడవడం, మిగతా సమయంలో కూర్చుని ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో పాటు మధుమేహం శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు వైద్యులు. ఈ మధ్య కాలంలో కార్డియోవాస్కులర్ మరణాలు 90 శాతం పెరిగాయట. ఎక్కువ సమయం కూర్చుంటే ఇది బ్లడ్ గ్లూకోజ్ , బ్లడ్ ఫ్లాట్స్, బ్లడ్ ప్రెజర్ శరీర బరువు, పొత్తికడుపులోని కొవ్వును పెంచుతుంది. శారీరక శ్రమ కండరాల బలాన్ని పెంచుతుంది అదే రోజంతా కూర్చుని గడిపేవారిలో కండరాల నష్టాన్ని తీసుకువస్తుంది. అంటే కాల్షియంను తగ్గిస్తుంది. ఇది మలబద్దకాన్ని పెంచుతుంది. పెద్ద పేగు క్యాన్సర్ కు దారి తీస్తుంది. రక్తనాళాలు దెబ్బతింటాయి. నిదానమైన రక్త ప్రసరణ వల్ల రక్తం గడ్డకట్టే అవకాశాలు కూడా ఎక్కవగా ఉన్నాయి.