PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హిజాబ్ పై బాక్సింగ్ చాంపియ‌న్ ఏమ‌న్నారంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వస్త్రధారణ విషయంలో ఎవరి ఇష్టాలు వారివని.. హిజాబ్‌ ధారణకు తాను వ్యతిరేకం కాదని ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్ విజేత నిఖత్‌ జరీన్‌ వ్యాఖ్యానించింది. ఒకరి వేషధారణ పూర్తిగా వారి ఎంపికకు సంబంధించినది అని ఆమె పేర్కొంది. ‘‘అది (హిజాబ్‌) వారిష్టం. దానిపై నేనేమీ వ్యాఖ్యానించను. నా అభిప్రాయం నాకు ఉంటుంది. వ్యక్తిగతంగా చేస్తే నేను హిజాబ్‌ ధారణను ఇష్టపడతాను. నాకెలాంటి అభ్యంతరాలు లేవు. నా కుటుంబానికి కూడా. కాబట్టి నా గురించి ప్రజలేం అనుకుంటున్నారనేదానితో నాకు సంబంధం లేదు’’ అని వివరించింది.

                           

About Author