మెగా హీరోతో సహజీవనం పై లావణ్య ఏమన్నారంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : తనను వరుణ్‌తేజ్‌తో ముడిపెడుతూ వస్తున్న వార్తలపై నటి లావణ్య త్రిపాఠీ స్పందించారు. ‘అతడితో కలిసి రెండు సినిమాల్లో నటించా. ఆమాత్రం దానికే లింకు పెట్టేస్తున్నారు. అసలీ పుకారు వినడానికి కూడా అదోలా ఉంది. ఒకసారైతే నేను సహజీవనం చేస్తున్నానని రాసేశారు. అది చూసి నేను షాకైపోయాను. ప్రస్తుతం నేనింకా సింగిలే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేదాన్ని నేను నమ్మను. కలిసి మాట్లాడి, నాకంటూ కొంత సమయం కేటాయిస్తేనే ఎదుటివ్యక్తి ఎలాంటివాడో తెలుసుకుని అప్పుడు ముందడుగు వేస్తాను’ అని తెలిపింది లావణ్య త్రిపాఠి.