PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

`లూసిఫ‌ర్`లో లేనిది.. గాడ్ ఫాద‌ర్ లో ఉంది : మోహ‌న్ రాజా

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: తెలుగులో చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్ రాజా గాడ్ ఫాద‌ర్ చిత్రాన్ని రూపొందించాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాను, ఈ నెల 5వ తేదీన ‘దసరా’ కానుకగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి మోహన్ రాజా మాట్లాడాడు. ‘లూసిఫర్’ సినిమా ఆల్రెడీ హిట్ .. తెలుగులో కొత్తగా ఏవుంటుంది? అనే చాలామంది అనుకుంటారు. కానీ ‘లూసిఫర్’ లో లేని ఒక కొత్త అంశాన్ని తెలుగులో టచ్ చేశాము. ఆ కొత్త అంశం ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేస్తుంది .. ఒక కొత్త కథను చూసినట్టుగానే అనిపిస్తుంది. ఎక్కడా కూడా మరోసారి ‘లూసిఫర్’ను చూస్తున్నట్టుగా అనిపించదు. అంతగా కసరత్తు చేయడం జరిగింది” అని అన్నాడు.

                                         

About Author