తాగునీటి వ్యవస్థకు జవాబుదారి ఏది.. వేసవిలో నెలకొన్న నీటి ఎద్దడి
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అన్న చందాన మారింది గడివేముల పంచాయతీ వ్యవస్థ పరిస్థితి గ్రామంలో రెండు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు మూడు బోర్లలో పుష్కలంగా నీళ్లు ఉండి సరఫరా చేసే వ్యవస్థ నిర్లక్ష్యం కారణంగా గడివేములలోని ఒకటో వార్డులో రెండు రోజుల నుంచి నీటి ఎద్దడి నెలకొంది ప్రతిసారి ఒకటో వార్డులోనే నీటి ఎద్దడి నెలకొనడం షరా మామూలు అయింది పంచాయతీ కార్యదర్శి స్థానికంగా లేకపోవడం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లకపోవడం కుర్చికే పరిమితమవడం ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొందని సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళిన పరిష్కరించకపోవడం తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ఒకటో వార్డు ప్రజలు వాపోయారు వ్యవస్థ మొత్తం మండల కేంద్రంలో ఉన్న మండల కేంద్రంలో సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు.