నరేష్ తో పెళ్లి పై పవిత్ర ఏమన్నారంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రముఖ నటుడు నరేష్ మూడవ భార్య రమ్య మీడియాకి ఎక్కడం మీద పవిత్ర లోకేష్ కూడా స్పందించారు. బెంగుళూరులో ప్రెస్ మీట్స్ పెట్టి అలా అసత్య ఆరోపణలు చేయడం కేవలం ప్రచారకాంక్షతోనే అని ఆమె ప్రత్యారోపణ చేశారు. ఇక తన భర్తగా చెప్పుకుంటున్న కన్నడ దర్శకుడు సుఖేంద్ర ప్రసాద్ ను తాను పెళ్లి చేసుకోలేదన్నారు. తమకు అధికారికంగా పెళ్లి జరగలేదన్నారు. సుఖేంద్ర ప్రసాద్ తో 2017లోనే విడిపోయినట్టుగా చెప్పిన పవిత్ర లోకేష్..ప్రస్తుతం నరేష్ కు తోడుగా ఉంటున్నట్టు ఓపెన్ అయ్యారు. ‘నరేష్ జెంటిల్మేన్.. ‘ అని ఆమె చెప్పుకొచ్చారు.