NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బంగార్రాజు రెండు రోజుల క‌లెక్ష‌న్ ఎంతంటే.. ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అక్కినేని నాగార్జున‌, నాగ‌చైత‌న్య న‌టించిన చిత్రం బంగార్రాజు. సోగ్గాడే చిన్నినాయ‌న చిత్రానికి ఇది సీక్వెల్. గ‌త సంక్రాంతికి విడుద‌లై సోగ్గాడే చిన్నినాయ‌న సినిమా సంద‌డి చేసింది. ఈ సారి బంగార్రాజు గా సంక్రాంతి బ‌రిలోకి నాగార్జున దిగారు. సోలోగా బరిలోకి దిగిన ‘బంగార్రాజు’ మూవీ మొదటి రోజు రూ. 17.5 కోట్లు కలెక్ట్ చేసి అందరికీ షాకిచ్చింది. నాగార్జున‌, చైత‌న్య‌ మాస్ పెర్ఫార్మెన్స్, కృతి శెట్టి గ్లామర్ అపీరెన్స్.. సినిమాకి మంచి ఓపెనింగ్స్ ను తెచ్చిపెట్టాయి. మొత్తం ఈ రెండు రోజుల్లోనూ ‘బంగార్రాజు’ చిత్రం రూ. 36కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్టు ట్విట్టర్ లో అఫీషియల్ గా ప్రకటించారు.

                                      

About Author