NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

`మేజ‌ర్` చూసిన రియ‌ల్ హీరో తండ్రి ఏమ‌న్నారంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : 26/11 ముంబయ్‌ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్‌ ఆర్మీ ఆఫీసర్‌ ‘సందీప్‌ ఉన్నికృష్ణన్‌’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్‌’. శశికిరణ్‌ తిక్క దర‍్శకత్వం వహించిన ఈ మూవీలో సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ పాత్రలో యంగ్‌ హీరో అడవి శేష్ నటించారు. సినిమా చూసిన‌ రియల్‌ హీరో సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ తండ్రి కె. ఉన్ని కృష్ణన్‌ తన అభిప్రాయం తెలిపారు. ‘సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితాన్ని ప్రతిబింబించేలా చాలా బాగా చూపించారు. చాలా మంచి సినిమా తెరకెక్కించారు. చిత్రబృందానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నటీనటుల నటన, సినిమాటోగ్రఫీ, కెమెరా వర్క్‌ ఎంతో బాగుంది. మా దుఃఖాన్ని మరిచేలా చేసింది. ఒక మాట చెబుతాను. సందీప్‌ చనిపోయాడని చాలామంది అనుకుంటున్నారు. కానీ కాదు. అతని తుదిశ్వాస వరకు ప్రజల ప్రాణాల్ని కాపాడే ప్రయత్నం చేశాడు. అది ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. నా కెరీర్‌ను హైదరాబాద్‌లోనే ప్రారంభించాను. నేను సందీప్‌తో కలిసి హైదరాబాద్‌లో జీవించాను, అతనితో మంచి సమయం గడిపాను. ఇప్పుడు సినిమా టీమ్ తో మంచి సమయం గడుపుతున్నాను. నేను హైదరాబాద్‌లో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. హైదరాబాద్‌కు మళ్లీ మళ్లీ వస్తాను.’ అని సందీప్‌ తండ్రి కె. ఉన్ని కృష్ణన్‌ పేర్కొన్నారు.

                                           

About Author