PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ భూములపై పెద్దమనుషుల పెత్తనమేంటి..?

1 min read

– నది లోతట్టు భూములను మేము సాగు చేసుకుంటాం..
– మాకు హక్కు ఉంది… అనుమతి ఇవ్వండి..
– 200 ఎకరాలు బిట్టు బిట్టుగా ఎలా పంచుకుంటారు..?
– భూములను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి.
– తహశీల్దార్ కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు.
– మునక భూములు స్వాహా కు కుట్రలు చేయలేదు.
– వైసీపీ నాయకుడు పులేంద్ర నాయుడు..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నది లోతట్టు భూముల పై పీకే ప్రాగటూరు కు చెందిన నలుగురు పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న సహదేవుడు, ఉసేన్, వెంకటేశ్వర్లు, లక్ష్మన్నల పెత్తనమేంటని వైసీపీ నాయకులు పులేంద్ర నాయుడు, నెహ్రు నగర్ గ్రామస్తులు పెద్ద శివన్న , మధు ,చిన్న శివన్న , పెద్ద మల్లయ్య , చిన్న మల్లయ్య , మల్లికార్జున , రామాంజనేయులు , నరసింహుడు, మహానంది ,ఈశ్వరయ్య, దస్తగిరి నాయుడు రెవిన్యూ అధికారులను నిలదీశారు. మునక భూములపై పెత్తనం చేలాయిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని శనివారం పగిడ్యాల మండల తహశీల్దార్ భారతి కి వైసీపీ నాయకుడు పులేంద్ర నాయుడు ఆధ్వర్యంలో గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పులేంద్ర నాయుడు మాట్లాడుతూ మా కుటుంబాలు కూడా శ్రీశైలం నీటిమునక నిర్వాసితులే. శ్రీశైల బ్యాక్ వాటర్ లో సర్వం కోల్పోయారు. మా పూర్వీకులు పీకే ప్రాగటూరు గ్రామానికి చెందిన వారేనని మాకు కూడా నది లోతట్టు భూములపై హక్కు ఉందని మేము కూడా సాగుచేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. పీకే ప్రాగటూరు గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు పెద్దమనుషులుగా చెలామణి అవుతూ శివాలయం కు చెందిన దాదాపు 200 ఎకరాల మునక భూమిని బిట్టు బిట్టుగా పంపకాలు చేసుకొని అమ్మకాలు సాగిస్తున్నారని వారి పైన చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కొందరు గిట్టని వారు తమ కుటుంబ సభ్యులపైన, నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మేము ఏ భూములను ఆక్రమించుకొనేందుకు కుట్ర చేయలేదని వెల్లడించారు. నది లోతట్టు భూములలో మాకు వాటా కావాలని గ్రామ పెద్దమనుషులను అడగడం తప్పా అని ప్రశ్నించారు. మాకు అక్కడ పెద్దల ఆస్తి ఆరు ఎకరాలు ఉంది..దానికి తోడు మరికొంత భూమి మాకు ఇస్తే సాగుచేసుకుంటామని అడిగితే మా పై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. మునక భూములను కొందరు అమ్ముకుంటున్నారని పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశామన్నారు. త్వరలోనే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నిజాలను ప్రజలకు వెల్లడిస్తానని అన్నారు. విచారణ చేసి న్యాయం చేస్తామని తహశీల్దార్ హామీ ఇచ్చారని తెలిపారు.

About Author