NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దిల్ రాజు కొడుకు పేరేంటంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. దిల్ రాజుకు కొడుకు పుట్టాడు. దిల్‌ రాజు కుమారుడికి అద్భుతమైన పేరు పెట్టినట్లు ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. దిల్‌ రాజు వారసుడికి ‘అన్వి రెడ్డి’ అని నామకరణం చేసినట్లు సమాచారం. అయితే దిల్‌ రాజు మొదటి భార్య అనిత పేరు కలిసివచ్చేలా ఈ పేరు పెట్టినట్లు టాక్. ఈ పేరు విషయంలో దిల్‌ రాజు రెండో భార్య తేజస్వినికి ఎలాంటి ఇబ్బందిలేదని, అలాగే సంస్కృతంలో కూడా ఆ పేరుకు మంచి అర్థం ఉండటంతో అడ్డుచెప్పలేదట. కాగా దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో 2017లో మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తేజస్విని రెండో వివాహం చేసుకున్నారు. డిసెంబర్‌ 10, 2020న నిజామాబాద్‌లో దిల్‌ రాజు, తేజస్వినిల వివాహం జరిగింది.

                                       

About Author