PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజ్యాంగ నిర్మాతకు ఏమిటీ దుస్థితి

1 min read

– ముళ్ల పొదలలో డా. బీఆర్. అంబెడ్కర్ విగ్రహం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి, వర్ధంతిని నాయకులు అభిమానులు అధికారులు ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే జూపాడు బంగ్లా మండలంలోని పారుమంచాల గ్రామంలో సచివాలయం దగ్గర ఆటో స్టాండ్ ఎదురుగా అంబేద్కర్ విగ్రహం శిథిలావస్థకు చేరుకొని చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నాయి. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాము కూడా అదే స్థితిలో శిథిలావస్థలో చేరుకున్నది.మండల నాయకులుకానీ, అధికారులు కానీ దీని గురించి పట్టించుకోకపోవడం శోచనీయమని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇదే ప్రాంతంలో మందు బాబులు మద్యం సేవించి అక్కడే మూత్ర విసర్జన చేస్తున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు.డా.బీఆర్ అంబెడ్కర్ విగ్రహం ఏర్పాటు లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. విగ్రహాలు శిథిలావస్థకు చేరకుండా చూడవలసిన బాధ్యత అధికారులకు లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక దళితుడు , మండల ఎంపీపీ ఒక దళితురాలు, గ్రామ సర్పంచ్ దలితుడే, విగ్రహ దాత కూడా దళితుడు అయితే రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తూ కూడా రాజ్యాంగ నిర్మాత కు అవమానకరం జరుగుతున్న విగ్రహా ప్రతిష్టకు చర్యలు తీసుకోకపోవడం దారుణమంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అంబెడ్కర్ వాదులమంటూ గొప్పలు చెప్పుకొనే అంబెడ్కరిస్టులు ఏమయ్యారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు, అంబెడ్కర్ వాదులు మేల్కొని దళిత బడుగు బలహీన వర్గాల పెన్నిధి డా.బాబా సాహెబ్ అంబెడ్కర్ విగ్రహాన్ని తక్షణమే విగ్రహా ప్రతిష్ఠ చేసి ఆత్మగౌరవం కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

About Author