PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాతపెన్షన్ కు ప్రభుత్వ అప్పులకు సంబంధమేమిటి ?

1 min read

– ఆర్థికమంత్రి అసంబద్ధ వాఖ్యలు సరి కాదు

– జిపియస్ పై ఆర్థిక మంత్రి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు – ఎస్టీయూ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లను మోసం చేస్తూ అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పారని, ప్రభుత్వ అప్పులకు పాత పెన్షన్ విధానానికి సంబంధమేమిటని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్. తిమ్మన్న మరియు కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్ .గోకారి విమర్శించారు. ఈ మేరకు వారు తేదీ 28-09-2023 న ఎమ్మిగనూరు ప్రాంతీయ కార్యాలయంలో సిపియస్ / జిపియస్ రద్దు అవగాహన సమావేశం జిల్లా అధ్యక్షులు ఎస్. గోకారి అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ సిపిఎస్ రద్దు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ. దీనికి సంబంధించి ప్రభుత్వం జిపిఎస్ పేరుతో కొత్త నాటకానికి తెరతీసిందని ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  అసెంబ్లీ సాక్షిగా జిపిఎస్ బిల్లు ప్రవేశపెడుతూ పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ చేస్తే ప్రభుత్వానికి అప్పులు పుట్టవని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, ప్రభుత్వ అప్పులకు పాత పెన్షన్ విధానానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు?ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానంలోనే సిపిఎస్ రద్దు చేస్తూ జిపిఎస్ ను అసెంబ్లీలో ఆమోదించిందని దీనివల్ల జిపిఎస్ మాకొద్దు సిపిఎస్  కావాలి అని ఉద్యోగులు ఉపాధ్యాయులు అడగాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.సిపిఎస్ మరియు జిపిఎస్ రెండింటిలోనూ ఉద్యోగుల భాగస్వామ్యం, షేర్ మార్కెట్, ఉన్నాయని షేర్ మార్కెట్ ఉన్నచోట 50% గ్యారెంటీ పెన్షన్ ఎలా ఇస్తారో బిల్లులో ప్రభుత్వం స్పష్టం చేయలేదని విమర్శించారు. జిపిఎస్ విధానంలో కరువు భత్యం, వేదన సవరణ, గురించి ప్రస్తావనలేదని అలాంటప్పుడు భవిష్యత్తులో పెరిగి మార్కెట్ ధరలకు కనుగుణంగా పెన్షన్ ఎలా పెరుగుతుందో ప్రభుత్వం తెలియజేయాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానంలో ఉన్నటువంటి వేతన సవరణ కరువు భత్యం గ్రూప్ ఇన్సూరెన్స్ గ్రాట్యుటీ,కమ్ముటేషన్, తదితర సౌలభ్యాలు కూడా జిపిఎస్ లో పొందుపరచాల్సిందేనని డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎటువంటి బాగస్వామ్యం లేకుండా పూర్తి భద్రత ఉండే పాత పెన్షన్ విధానమే మాకు కావాలని డిమాండ్ చేశారు. రాబోయే సాధారణ ఎన్నికలలో పాత పెన్షన్ విధానమును ప్రధాన అజెండాగా అన్ని రాజకీయ పార్టీలు పెట్టే విధంగా ఒత్తిడి తెస్తామని, ఎవరైతే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని అజెండాగా హామీ ఇస్తారు అటువంటి వారితోనే కలిసి పనిచేయడానికి ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లు మరియు వారి కుటుంబాలు దాదాపు 70 లక్షల మంది ఓటర్లు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ప్రాంతీయ సమన్వయకర్త బి. వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు మోజేష్, షాజహాన్, జేరు బండి శీను, అడివన్న, బాబయ్య, కోటప్ప, ముకుందా చారి, నీలకంఠ, రామచంద్ర, వీరేష్, తిమ్మరాజు, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

About Author