రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీతం ఎంతంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : భారత తొలి గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డు సృష్టించారు. సంతాల్ ఆదివాసీ తెగకు చెందిన ఆమె భారత 15వ రాష్ట్రపతిగా తిరుగులేని మెజారిటీతో కొత్త చరిత్ర లిఖించారు. స్వాతంత్య్రానంతరం జన్మించిన తొలి రాష్ట్రపతిగానే గాక ఇప్పటిదాకా ఆ పదవి చేపట్టిన వారిలో అత్యంత పిన్న వయస్కురాలిగా కూడా నిలిచారు. ప్రతిభా పాటిల్ తర్వాత ఈ పదవి అధిష్టించనున్న రెండో మహిళ ముర్ము. భారత రాష్ట్రపతి నెల జీతం రూ. 5 లక్షలు. దీనిని 2018లో రూ. 1.50 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. దేశంలో అత్యధిక వేతనం రాష్ట్రపతికే ఉంటుంది. జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. రాష్ట్రపతికి గృహ, వైద్యం. ప్రయాణ ఖర్చులు ఉచితం. అలాగే కార్యాలయ ఖర్చుల నిమిత్తం సంవత్సరానికి రూ.1 లక్ష లభిస్తుంది. భారత రాష్ట్రపతితోపాటు వారి జీవిత భాగస్వామి ప్రపంచంలో ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించవచ్చు.