లతా మంగేష్కర్ ఆస్తుల విలువ ఎంతంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తుదిశ్వాస విడిచారు. ఐదేళ్ల ప్రాయంలోనే గాయనిగా ప్రస్థానం ప్రారంభించారు. వివిధ భాషల్లో దాదాపుగా 50వేల పైచిలుకు పైగా పాటలు పాడి శ్రోతలను అలరించారు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో వేల పాటలు పాడిన లతాజీ రెమ్యునరేషన్ కూడా అత్యధికంగానే తీసుకునేవారు. 1950వ దశకంలో ఒక్కో పాటకు సుమారు 500 రూపాయల పారితోషికాన్ని అందుకునేవారట. అప్పట్లో ఆశా భోంస్లే సహా పేరున్న సింగర్స్‌కి సైతం 150 రూపాయలు మాత్రమే ఇచ్చేవారట. ఆ సమయంలోనే లతాజీకి అందరి కంటే అత్యధికంగా రెమ్యునరేషన్ ఇచ్చేవారని స్వయంగా ఆశా భోంస్లేనే ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మొదట్లో 25 రూపాయలతో ప్రారంభమైన ఆమె సంపాదన ప్రస్తుతం వంద కోట్లకు పైగా చేరుకుంది. ఆమెకు ముంబైతో సహా పలు నగరాల్లో విలాసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లు ఉన్నాయి. చనిపోయే నాటికి లతా మంగేష్కర్ ఆస్తుల విలువ సుమారు రూ. 200 కోట్లకు పైగానే ఉందని సమాచారం.