PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యోగి ఆదిత్యనాథ్ ఆస్తుల విలువ ఎంతంటే ?

1 min read

పల్లెవెలుగువెబ్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ గోరఖ్ పూర్ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల విలువ ప్రకటించారు. అఫిడవిట్‌లో రూ.1,54,94,054 ఆస్తులను ప్రకటించారు. ఇందులో చేతిలో నగదు, ఆరు బ్యాంకు ఖాతాల బ్యాలెన్స్, సేవింగ్స్ ఉన్నాయి. తన వద్ద రూ. 12,000 విలువైన సామ్‌సంగ్ మొబైల్ ఫోన్, రూ. 1,00,000 విలువైన రివాల్వర్, రూ. 80,000 విలువైన రైఫిల్ ఉన్నట్లు తెలిపారు. తన పేరు మీద వ్యవసాయ, వ్యవసాయేతర భూములు లేవన్నారు. అలాగే సొంత వాహనం కూడా లేదని వెల్లడించారు.

         

About Author