PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్: వేస‌వి వ‌చ్చిందంటే చాలు.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలి అన్న ఆలోచ‌న అంద‌రిలోను మొద‌ల‌వుతుంది. సాధార‌ణంగా వేస‌విలో డీహైడ్రేష‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. డీహైడ్రేష‌న్ స‌మ‌స్యను అధిగ‌మించడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. శ‌రీరంలో నీటి శాతం అధికంగా ఉండేలా చూసుకోగ‌లిగితే.. డీహైడ్రేష‌న్ స‌మ‌స్య మ‌న ద‌రిదాపుల్లోకి కూడ రాదు. మ‌నం తినే ఆహారం, డ్రింక్స్ విష‌యంలో త‌గిన జాగ్రత్తలు పాటిస్తే.. ఎండాకాలంలో ఆరోగ్య స‌మ‌స్యలు ఉత్పన్నం కావు. నీటిని త‌రుచూ తీసుకోవాలి. నీటితో పాటు నీటి శాతం అధికంగా ఉండే పండ్లు, కూర‌గాయ‌లు తీసుకుంటే.. శ‌రీరం నీటి శాతం పెర‌గ‌డం తో పాటు.. ఆరోగ్యం కూడ కాపాడుకోవ‌చ్చు.
ఫ్రిజ్ వాట‌ర్ మంచిదేనా?
మ‌నం ఎండాకాలం బ‌య‌ట‌ నుంచి రాగానే.. చ‌ల్లని నీరు కోసం వెతుకుతాం. ప‌ల్లెల్లో అయితే.. చాలా వ‌ర‌కు ఫ్రిజ్ వాడ‌కం త‌క్కువ క‌నుక కుండ‌లో నీటి చ‌ల్లబరుస్తారు. ప‌ట్టణాల్లో చాలా మంది ఫ్రిజ్ వాడుతారు. ఎండ వేడి నుంచి ఉప‌శ‌మ‌నం కోసం వెంట‌నే ఫ్రిజ్ లో వాట‌ర్ తాగేస్తాం. అలా తాగ‌డం ప్రమాదం అంటారు వైద్య నిపుణులు. ఫ్రిజ్ లో వాట‌ర్ చాలా చ‌ల్లగా ఉంటే.. వెంట‌నే నోట్లోకి పోసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర ఉష్ణోగ్రత‌లు ఉన్నట్టుండి ప‌డిపోతాయి క‌నుక … ఫ్రిజ్ లో వాట‌ర్ తొంద‌ర‌గా తాగ‌కుండా.. కొంత సమయం త‌ర్వాత తాగ‌డం మంచిదంటారు. కుండ నీరు అయితే ఎలాంటి ఇబ్బంది ఉండ‌దంటారు. కుండ‌లో నీరు కొంత ప‌రిమితి మేర‌కు మాత్రమే చ‌ల్ల‌బ‌డుతుంది కాబ‌ట్టి.. ఫ్రిజ్ లో ఉన్నంత కూల్ కుండ నీరులో ఉండ‌దు. కాబ‌ట్టి కుండ నీరు వాడ‌టం మంచిదంటారు.
ఆల్కహాల్: వేస‌విలో ఆల్కహాల్ తీసుకోకూడ‌ద‌ని సూచిస్తారు వైద్యులు. మ‌ద్యానికి శ‌రీర ఉష్ణోగ్రత‌ను పెంచే గుణం ఉంటుంది క‌నుక మ‌ద్యం తీసుకోవ‌డం ద్వార శ‌రీర ఉష్ణోగ్రత‌లు పెరిగి వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్యల‌కు దారితీస్తాయి.
కాఫీ, టీలు: కాఫీ , టీలు కూడ శ‌రీర ఉష్ణోగ్రత‌ను పెంచుతాయి. నిర్జలీక‌ర‌ణం కూడ పెరుగుతుంది. కాబ‌ట్టి కాఫీ, టీల‌కు ప్రత్యామ్నాయంగా.. గ్రీన్ టీ లాంటి వాటిని వాడటం మంచిదంటారు.
ఆయిల్ ఫుడ్స్: వేస‌విలో ఆయిల్ ఫుడ్స్.. ముఖ్యంగా డీప్ ఆయిల్ ఫుడ్స్ కు దూరంగా ఉండ‌టం మంచింది. ఇవి సాధార‌ణంగానే శ‌రీర ఉష్ణోగ్రత‌ను పెంచుతాయి. రోధ నిరోధ‌క శ‌క్తిని కూడ త‌గ్గిస్తాయి. క‌రోన నేప‌థ్యంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి అత్యంత అవ‌శ్యం అయిన నేప‌థ్యంలో ఆయిల్ ఫుడ్స్ సాధ్యమైనంత వ‌రకు త‌గ్గిస్తేనే మంచిద‌వుతుంది.
వీటితో పాటు ఐస్ క్రీమ్స్ , మ‌సాల వంట‌లు, కాల్చిన మాంసం లాంటి వాటిని దూరంగా ఉంచ‌డం ద్వార అనారోగ్యాన్ని ద‌రిచేర‌నీయ‌కుండా చూడొచ్చు.

About Author