PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుండె జ‌బ్బులు రాకూడ‌దంటే.. ఏం చేయాలి..?

1 min read

Anatomical heart isolated. Heart diagnostic center sign. Human heart cartoon design. Vector image.

ప‌ల్లె వెలుగు వెబ్: కొలెస్ట్రాల్ త‌గ్గించుకుంటే గుండె జ‌బ్బులు మ‌న ద‌గ్గరికి రావు. శ‌రీరంలో కొలెస్ట్రాల్ శాతం పెరగ‌టం వ‌ల్లనే గుండె జ‌బ్బులకు కార‌ణ‌మ‌వుతున్నాయి. కాబ‌ట్టి ఆహార ప‌దార్థాలు తిన‌డంలో నియంత్రణ‌, త‌ర‌చూ వ్యాయామం లాంటి జీవ‌న శైలిలో మార్పుల ద్వార గుండె జ‌బ్బుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

  • ప్రతి రోజు వ్యాయామం క్రమం త‌ప్పకుండా చేయాలి. క‌నీసం అర‌గంట పాటు వేగంగా న‌డ‌వాలి.
  • ఒత్తిడిని ద‌గ్గరికి రానీయ‌కూడ‌దు. ఒత్తిడి పెర‌గ‌డం ద్వార గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. స్నేహితులు, బందువులు, పిల్లలు ఇలా ఎవ‌రితోనైనా స‌రే ఫ్రీగా న‌వ్వగల‌గాలి. త‌ద్వార ఒత్తిడి త‌గ్గుతుంది.
  • స్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ‌గా ఉండే ఆహార‌ ప‌దార్థాలు తీసుకోకూడ‌దు. వీటిలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ‌గా ఉంటుంది.
  • షుగ‌ర్ కూడ ఎక్కువ‌గా వాడ‌కూడ‌దు. ఇది బ‌రువు పెరుగుద‌లకు కార‌ణ‌మ‌వుతుంది. ప్రక్టోజ్ అధికంగా ఉండే తీపి ప‌దార్థాలు తీసుకోకూడ‌దు.
  • ఆహారంలో రోజూ త‌గినంత ఫైబ‌ర్ ఉండే విధంగా చూసుకోవాలి. కూర‌గాయ‌లు, ఆకుకూరలు క్రమం త‌ప్పకుండా ఆహారంలో ఉండే విధంగా చూసుకోవాలి.
  • చేప‌ల్లో ఉండే డైహైడ్రాక్సీ అసిటోన్ శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చూస్తుంది. వారంలో ఒక్కసారైన సీ ఫుడ్ తీసుకోవాలి.
  • వేపుడు ప‌ధార్థాల‌కు చాలా దూరంగా ఉండాలి. బంగాళ‌దుంప‌ల వేపుడు, చిప్ప్ అధికంగా కొలెస్ర్టాల్ పెరిగేందుకు దోహ‌దం చేస్తాయి. కాబ‌ట్టి వీటిని ఎక్కువ‌గా తిన‌కూడ‌దు.

About Author