PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యుద్ధానికి ఆయ‌న తీసుకుంటున్న చికిత్సే కార‌ణ‌మా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ పై అమెరికా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. క్యాన్సర్ చికిత్సలో భాగంగా తీసుకుంటున్న స్టెరాయిడ్ల వల్లే పుతిన్‌లో విపరీత ఆలోచనలు వస్తున్నాయేమోనని అనుమానం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌పై దాడితో పాటు అణ్వస్త్ర బలగాలను సన్నద్ధంగా ఉండాలని చెప్పడం వెనుక స్టెరాయిడ్ల వాడకం ఉండొచ్చని అమెరికన్ ఇంటలిజెన్స్ నివేదిక తెలియజేస్తోంది. పుతిన్ ముఖంలో వస్తున్న మార్పులు దీనికి బలం చేకూరుస్తోందని వెల్లడించింది. పుతిన్‌ ఎవరిని కలిసినా 13 అడుగుల టేబుల్ గ్యాప్ పెట్టడాన్ని కూడా అమెరికా ఇంటెలిజెన్స్ అనుమానంగా చూస్తోంది. అయితే అమెరికన్ ఇంటలిజెన్స్ నివేదికపై రష్యా స్పందించాల్సి ఉంది.

                             

About Author