ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తే మాలలకు జరిగే నష్టమేంటి
1 min readఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు
ప్రేమ రాజ్ ,విజ్జి మాదిగలు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తే మాలలకు జరిగే నష్టం ఏమిటని ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు ప్రేమరాజు మాదిగ, సగ్గేల విజ్జి మాదిగలు ప్రశ్నించారు. మంగళవారం నందికొట్కూరు పట్టణంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రేమరాజు, విజ్జి మాట్లాడుతూ మాదిగలు ఉప కులాలు ఎస్సీ వర్గీకరణ కోసం మన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేసి ఎంతో మంది బలిదానం చేసిన తర్వాత వర్గీకరణ సాధించుకునే దిశగా అడుగులు వేస్తున్న సమయంలో కొంతమంది వర్గీకరణ జరిగితే జీర్ణించుకోలేని శక్తులు మాదిగలకు తీరని అన్యాయం చేయడానికి పావులు కదుపుతున్నారని అలాంటి నీచ సంస్కృతి మానుకొని మనుషులుగా మానవత్వంతో వర్గీకరణకు సహకరించాలని వారిని కోరుతున్నామన్నారు.గతంలో వేసిన మూడు కమిటీలుమాదిగలు వెనుకబడ్డారని తేల్చి చెప్పాయని వారు గుర్తుంచుకోవాలన్నారు.డాక్టర్ బాబాసాహెబ్అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అన్ని కులాలకు వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం రావాల్సిన హక్కులను పొందడం వారి హక్కు అని రాజ్యంగములో ఆర్టికల్ 3 లో పొందుపరచడం జరిగిందన్నారు.వర్గీకరణ సాధించుకున్న తరువాత ఎస్సీలలో ఉన్నటువంటి మాల మాదిగ మరియు ఉప కులాలను కలుపుకొని రాజ్యాధికారం వైపు అడుగులు వేద్దామని మా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.ఎస్సీ వర్గీకరణద్వారా అన్నదమ్ములుగా విడిపోదాం దళితులుగా ఏకమవుదామని రాజ్యాధికారం కోసం పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేస్తున్నామని పేర్కొన్నారు .అంబేద్కర్ ఆశయం కోసం పనిచేస్తున్న వారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించరని ఆయన ఆశయాలను గుర్తించిన దళితులమైన మనం ఏకమై రాజ్యాధికారం వైపు అడుగులు వేద్దామని మా సోదరులకు పిలుపునిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ .జిల్లా సహాయ కార్యదర్శి డాన్ శీను మాదిగ, జూపాడుబంగ్లా మండల అధ్యక్షుడు సురేష్ మాదిగ, విజయుడు ,.అనిల్ మాదిగ, ముఖ్య కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.